చోద్యం చూస్తున్న పోలీసులు. ప్రజల ఆగ్రహం.
- ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు.
- అంతుపట్టని పోలీసుల తీరు.
ఆర్మూర్, తెలంగాణ వార్త: 17 ఆగస్టు:::: ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి చౌరస్తా వద్ద బుధవారం రోజు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం నిత్యకృత్యంగా మారింది. ట్రాఫిక్ అంతరాయంతో ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా, పెర్కిట్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏదో ప్రాంతంలో గంటల కొద్ది ట్రాఫిక్ లోనే ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తుంది.
ట్రాఫిక్ నియంత్రణకు అడ్డుకట్ట వేసే విధంగా అక్కడ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ వాటి పనితీరు శూన్యం అని చెప్పవచ్చు.మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారంటే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అడుగుకొక పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తారు. అయితే
ఆర్మూర్ పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఆపరేట్ చేసేందుకు కానిస్టేబుల్, హోంగార్డు ను ఉంచకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి ప్రధాన కారణమే అని చెప్పవచ్చు.సుమారు గంటసేపు పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట, వెహికల్స్ ఫోటోలు తీయడం, చాలాన్లు వేయడమే కాకుండా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన బాధ్యత ఉందని ప్రయాణికులు అనుకుంటున్నారు. అంతే కాకుండా బాల్కొండ నుండి నిజామాబాద్, హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్ , 108 వాహనం ఆగిపోవడంతో ఎమర్జెన్సీ వాహనాలు సైతం తీవ్ర ట్రాఫిక్ అంతరాయంలో ఇరుక్కుపోవడం గమనార్హం.రోజు తప్పని తిప్పలుగా ప్రయాణికుల మార్గాన్ని సులభతరం చేసేలా పోలీసులు ట్రాఫిక్ పై దృష్టి సారించారా అని ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
Leave a comment