-స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం పట్ల హర్షం
హైదరాబాద్, డిసెంబర్14:-టీఆర్ఎస్ కు తిరుగేలేదని స్థానిక సంస్థల కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో లభించిన అఖండ విజయం మరోమారు రుజువు చేసిందని, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ శాసన సభ్యులు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని ఈ అప్రతిహత విజయంతో చాటి చెప్పామని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అన్ని స్థానాలకు అనగా నూటికి నూరు శాతం టిఆర్ఎస్ గెల్చుకోవడం హర్షదాయకమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలు గా ఘన విజయం సాధించిన భానుప్రసాదరావు, ఎల్. రమణ,విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, తాతా మధులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజానీకం టిఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే ఉన్నారని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని జీవన్ రెడ్డి అభివర్ణించారు..
Leave a comment