బిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత టిఆర్ఎస్ రద్దు చేస్తారా? కారు గుర్తు ఉంటుందా?
హైదరాబాద్, తెలంగాణ వార్త: రాజకీయాల్లో కీలక నాయకులు ఏ అడుగు వేసిన వార్త అవుతుంది త్వరలోనే భారత రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి జాతీయస్థాయిలో తన గలాన్ని వినిపించేందుకు రెడీ అయ్యారు. దీనికి దసరా ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పరిస్థితి ఏంటి టిఆర్ఎస్ వచ్చిన తర్వాత దీనిని రద్దు చేస్తారా అనే ధర్మసందేహాలు రాజకీయ తేరా మీద అరంగేట్రం చేస్తున్నాయి. అక్టోబర్ 5న విజయదశమి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కొత్త జాతీయ పార్టీని ప్రకటిస్తారని అధికారికంగా ప్రకటించారు. ఆ జాతీయ పార్టీ ఏర్పాటుపై టిఆర్ఎస్ శాసనసభ పక్షం పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసిన తర్వాత సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు కెసిఆర్ ప్రకటన చేస్తారని బుధవారం రాత్రి ఎంపిక చేసిన మీడియా సంస్థలకు లీక్ చేశారు.
Leave a comment