పసుపు కు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలి.
ఆర్మూర్( తెలంగాణ వార్త )పసుపు పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ స్థాయి నుండి రైతులను ఏకం చేసి ఆందోళన చేపట్టనున్నట్లు అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం కుమార్ నారాయణ భవన్ లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ పసుపుకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని పంట చేతికి వచ్చిన ప్రతిసారి రైతులు ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని ఈ పరిస్థితి ప్రతి ఏడు కొనసాగుతూ వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్ తాను గెలిస్తే పసుపు బోర్డు తీసుకువస్తానని లేకపోతే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి నేటికీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని పసుపు బోర్డు కాదు అంతకుమించి తీసుకువస్తున్నామనీ చెబుతూ రైతుల ను మభ్య పెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు అని విమర్శించారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోళ్ళు చేసి ఇ నేటికీ డబ్బులు ఇవ్వని పరిస్థితి నెలకొందని విపరీతమైన తరుగుతో రైతులను నట్టేట ముంచుతున్నారు అని వారు విమర్శించారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది జిల్లా ఎంపీ బిజెపికి చెందిన వారు పైగా బాండ్ పేపర్ రాసి మరి పసుపు బోర్డు తీసుకువస్తానని ప్రగల్బాలు పలికిన వారు కాబట్టి పసుపు బోర్డు కు మించినది అవసరం లేదు గానీ కనీసం పసుపు బోర్డు అయిన తీసుకురావాలని తద్వారా రైతాంగానికి గిట్టుబాటు ధర కలిగి రైతుకు లాభం చేకూరుతుందని ఆ దిశగా ఆందోళనను ఉధృతం చేయుటకు అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుండి ప్రచార యాత్ర నిర్వహించి రైతులను ఏకం చేసి ఉద్యమం చేపడతామని అన్నారు
ఈ ప్రెస్ మీట్ లో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు దేవారం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే గంగాధర్ పి రామకృష్ణ నాయకులు కె రాజేశ్వర్ యు రాజన్న తదితరులు పాల్గొన్నారు
Leave a comment