తెలంగాణ వార్త:: రాజేందర్ నగర్ లోని ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లాకలెక్టర్ సి.నారాయణ రెడ్డి సందర్శించారు. మూడు నెలల్లో కొసరి జరిగే సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్ర స్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు.
కలెక్టర్ వెంట రాజేందర్ నగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు, పలు గుర్తింపుపొందిన రాజకీయ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నాru
Leave a comment