Tgప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 04 తెలంగాణ వార్తల : ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నిజామాబాద్ ఆర్దీవో రవిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏ ఏ
శాఖల్లో ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయనే వివరాలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడిస్తూ, వారం లోపు వాటన్నింటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ, ప్రజావాణి సైట్ లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు.
Leave a comment