Home హాట్ న్యూస్ 10 శాతం లేని కులాలు పాలించడమేమిటి..?
హాట్ న్యూస్

10 శాతం లేని కులాలు పాలించడమేమిటి..?

డి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్

మాక్లుర్, తెలంగాణ వార్త ::10 శాతం లేని రెడ్డి వెలుమలు ఈ తెలంగాణ రాజ్యాన్ని పాలించడం ఏమిటని డిఎఎస్ పి (దళిశక్తి ప్రోగ్రాం ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ ప్రశ్నించారు. ఆదివారం మాక్లూర్ మండలంలోని రామచంద్ర పల్లి, గుత్ప, చిన్నాపూర్, కల్లెడి గ్రామాలకు పదివేల కిలోమీటర్ల స్వరాజ పాదయాత్ర చేరుకున్న సందర్భంగా ఆ గ్రామాల్లో డిఎస్ పి జెండా దిమ్మెలు,శిలా పలకాలు ఆవిష్కరించి మాట్లాడారు. 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ,ఎస్టీలు ప్రజలు కదా ఈ తెలంగాణను పరిపాలించాల్సిందన్నారు. మన రాజ్యం వస్తే అట్టడుగు వర్గాలైన బీసీ,ఎస్సీ,ఎస్టీలకు విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సమకూరుతాయని అన్నారు. అగ్రవర్ణ పాలకులు పేద వర్గాలను రాజకీయ చైతన్యం కాకుండా మాయ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ గడ్డమీద బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం నెలకొల్పెందుకు ఈ పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపట్టామని, దోపిడికి గురైన పేద వర్గాలు రాజ్యాన్ని ఏలాలన్నారు. మన ఓట్లతో అగ్రకులాలు సింహాసనం ఎక్కుతున్నారని మన శక్తితో వాళ్ళ భూముల్లో పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఈవిరితో పాటు కార్యక్రమంలో డిఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్. మహారాజ్,రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, ప్రేమ్ జిల్లా అధ్యక్షుడు మహిపాల్, సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు రవిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మహారాజ్, బీసీ ఎస్సి ఎస్టీ నాయకులు, ఆయాగ్రామాల డియస్పి కమిటీ అధ్యక్షులు. మెంబర్లు, డియస్పి సైనుకులు, మహిళలు, యువతి, యువకులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page