(తెలంగాణ వార్త)ప్రముఖ న్యాయవాది, బిజెపి నాయకురాలు ప్రసన్న గారిపై కొంత మంది టీఆర్ఎస్ గుండాలు న్యాయవాదుల రూపంలో దాడి చేయడం సిగ్గు చేటు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నాడు కేసీఆర్. అందుకే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నాడు. ఒక మహిళ న్యాయవాది అని కూడా చూడకుండా దాడులు చేయించడం పిరికిపంద చర్య. రాష్ట్రంలో మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా ? తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. నియంత పాలనను ప్రశ్నిస్తే దాడి చేయడం అలవాటైపోయింది. ఈ ప్రభుత్వం చేసే ప్రతి చర్యని ప్రజలు గమనిస్తున్నారు.. తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టడం కాయం.
ప్రసన్న గారిపై దాడి చేసిన గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
Leave a comment