Home హాట్ న్యూస్ మెరుపు వేగంతో స్పందిస్తాం రష్యా అధ్యక్షుడు పుతిన్.
హాట్ న్యూస్

మెరుపు వేగంతో స్పందిస్తాం రష్యా అధ్యక్షుడు పుతిన్.

ఉక్రెయిన్ విషయంలో మద్దతు పలకాలని లేదా వకాల్తా పుచ్చుకోవాలని భావించే దేశాలకు తాను చెప్పే విషయం ఒక్కటేనని ఆయన తెగేసి చెప్పారు.

“ఎవరైనా మా ఇరు దేశాల విషయంలో జోక్యం చేసుకోవాలని చూసినా, మా దేశాన్ని బెదిరించినా, మా ప్రజల భద్రతకు విఘాతం కలిగించినా తక్షణం మెరుపు వేగంతో స్పందిస్తాం. మేము ఇచ్చే బదులు ఎలా ఉంటుందంటే మీ జీవితంలో కనీ వినీ ఎరుగని, చూడని తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

ఈ విషయంలో మేం దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికే అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అందువల్ల నా మాట వింటారని అనుకుంటున్నా అని పుతిన్ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. అదేసమయంలో ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశ్యం లేశమాత్రం కూడా లేదన్నారు.

కానీ, ఉక్రెయిన్‌లో జరుగుతున్న రక్తపాతానికి కారణం ఆ దేశ పాలకులేనని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో డీ మిలటరైజేషన్ (నిస్సైనీకరణ) కోసమే తాము ప్రయత్నాలు మొదలుపెట్టామని, అందువల్ల ఆ దేశ సైనికులు ఆయుధాలు పడేసి ఇంటికెళ్లిపోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో చరిత్ర మరచిపోలేని భీకయ భయానక పరిస్థితులను చూస్తారని పుతిన్ హెచ్చరించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page