Home హాట్ న్యూస్ ఘనంగా ఈద్ -ఉల్ -ఫితర్ వేడుకలు.
హాట్ న్యూస్

ఘనంగా ఈద్ -ఉల్ -ఫితర్ వేడుకలు.


నందిపేట్: తెలంగాణ వార్త
ముస్లింలు అత్యంత పవిత్రంగా కొలిచే రంజాన్ (ఈద్ -ఉల్-ఫితర్ ) పండగను మంగళవారం నందిపేట్ మండలం లోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు నెల రోజుల పాటు మండుటెండ లను సైతం లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం లో సోమవారం సాయంత్రం పర్వాలు చంద్ర దర్శనం సమాచారంతో ఉపవాస దీక్షలు విరమించి మంగళవారం (ఈద్-ఉల్-ఫితర్ ) పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు దీంతో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న ముస్లిం లు మంగళవారం ఉదయం కొత్త బట్టలు ధరించి సామూహికంగా తక్బీర్ పటిస్తూ గ్రామాల సమీపంలోని ఈద్గాల వద్ద చేరుకుని ఫేస్ ఇమామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు అనంతరం ఆలింగణంతో ఈద్ ముబారక్ అంటూ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు
నందిపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఫేస్ ఇమామ్ ( హఫీజేఖురాన్) ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి మండలంలోని డొంకేశ్వర్ ఖుదవందపూర్ వివిధ గ్రామాలలోని గ్రామాలలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు రంజాన్ పండగ సందర్భంగా మండలంలోని సర్పంచులు పార్టీల నాయకులు అధికారులు ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ పండగ ప్రత్యేక ప్రార్థన సందర్భంగా ఈద్గాల వద్ద నందిపేట్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు అనంతరం పండగ శుభాకాంక్షలు తెలిపారు
ఎం పి పి, సంతోష్ , జడ్ పి టి సి ఎర్రం యమున ముత్యం, నందిపేట్ సర్పంచ్ ఎస్ జి వాణి తిరుపతి, కో అప్సన్ మెంబెర్ సయ్యద్ హుస్సేన్, మండల ముస్లిం కమిటీ నాయకులు కాలీమ్, గౌస్ తదితరులు మండల ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page