ఆదివారం :29 మే తెలంగాణ వార్త: ప్రముఖ దళిత నాయకులు అనగారిన వర్గాల ప్రజా సేవకుడు పీ సీ భోజన్న గారి ప్రథమ వర్ధంతి ఆర్మూర్ లోని రోడ్లు మరియు భవనాల విశ్రాంతి భవనంgలో పీ సీ భోజన్న గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దళిత సంఘాలు, జేఏసీ, కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ సంఘాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దళిత ఐక్య సంఘటన డివిజినల్ మాజీ అధ్యక్షులు గుమ్మడి చంద్రయ్య కోటేశ్వరరావు, జంగమ్మ అశోక్, పింజా భూమేశ్వర్, పింజా పెద్ద భోజన్న ,ఎల్ టీ కుమార్ మాట్లాడుతూ పీ సీ భోజన్న మరణం దళితులకు తీరనిలోటని, ఆయన చేసిన సేవలు ఏ దళితుడు కూడా మరువరని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ పీ సీ భోజన్న కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని ఆయన సేవలను పార్టీ మరువద్దని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయాలని కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె బబ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడ మీద బాలకిషన్ , ఎస్ కే పాష, సీనియర్ నాయకులు ఫయ్యూమ్, దామెర రవి, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు
Leave a comment