నందిపేట్. తెలంగాణ వార్త::Mro అనీల్ కుమార్ కు సమ్మె నోటీస్ అందజేస్తున్న వీఆర్ఏలు.
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వీఆర్ఎల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేపట్టనున్నట్లు శుక్రవారం నందిపేట్ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ అనీల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. గ్రామానికి సంబంధించిన విధులు నిర్వహిస్తామని, ఇతర విధులు నిర్వర్తించబోమని వారు తెలిపారు. ఈ నెల 25 నుంచి తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మె చేయనున్నట్లు వారు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పేస్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కె సి ఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 55 సం॥రాల వయస్సు పైబడిన వి. ఆర్ ఏల వారసులకు ఉద్యోగం ఇచ్చి వారికి పేన్షన్. సౌకర్యం కలిగించాలని సమ్మె నోటీసులో పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో.
వి ఆర్ ఏ ల సంఘం మండల అధ్యక్షుడువేముల సాయన్న, సుంకరి గంగాధర్ ( ఉపాద్యక్షుడు)
, కదం రాజేందర్ (ప్రధానకార్యదర్శి వివిధ గ్రామాల వి ఆర్ ఏ లు వున్నారు.
Mro అనీల్ కుమార్ కు సమ్మె నోటీస్ అందజేస్తున్న వీఆర్ఏలు.
Leave a comment