మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ కొక్కెర భూమన్న.
హైదరాబాద్ న్యూస్ (తెలంగాణ వార్త): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తూ.. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న కుట్రలను నిరసిస్తూ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా , మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్, ఎస్సీ ఉప కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రెడ్ హిల్స్ లక్డికాపూల్ లోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట సోమవారం మహా ధర్నాను నిర్వహించారు.
సింగరేణి సంస్థ జోలికి వస్తే సహించేది లేదని వారు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర మాదిగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న నేతృత్వంలో ఈ మహా ధర్నా నిర్వహించారు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు ఎం. మల్లేష్, వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనక రాజు ఉపకులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం , వేముల బలరాం, తదితరులు పాల్గొన్నారు.
Leave a comment