ఆర్మూర్ (తెలంగాణ వార్త) గురువారం ఆర్మూర్ పట్టణంలో ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభల జనవరి 7 నుండి 10 వరకు జరగబోయే పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు కేంద్ర ప్రభుత్వము పాలన నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ కుట్రలు చేస్తుందని నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేస్తూ దేశ సంపదను బడా కార్పొరేట్ పెట్టుబడులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని. ఇప్పటికే రైల్వే విమానం బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి. అలాగే సింగరేణి కూడా ప్రవేట్ పరం చేస్తామనడం సిగ్గుచేటన్నారు దేశ పరిపాలన చేయాలి తప్ప దేశ సంపదను గత ఏడు సంవత్సరాలుగా బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా బిజెపి ప్రభుత్వం అదే పనిగా పెట్టుకుందని విమర్శించారు అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు ఒకే లాగా తీరు అన్నట్టు వివరించడం సరైనది కాదని తెలంగాణ ఏర్పడ్డాక ముందు ఒక మాట తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకో మాట అన్నట్టుగా టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు అదే విధంగా ఉందని అన్నారు ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేసిందన్నారు ఇకనైనా టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు మార్చుకోవాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని అదేవిధంగా నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు 3016 ఇవ్వాలని కరోనా సకాలంలో చనిపోయిన వాళ్లకి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అదేవిధంగా ఇప్పుడు వస్తున్నా ఓమిక్రాన్ సోకిన వాళ్లకి మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే జనవరి 7 నుండి 10 వరకు జరగబోయే జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆర్మూర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ సిపిఐ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు ఏఐవైఎఫ్ నిజాంబాద్ జిల్లా కార్యదర్శి పి రంజిత్ కుమార్ నాయకులు హలీం ఫిరోజ్ రహీం కృష్ణ మౌలానా తదితరులు పాల్గొన్నారు
Leave a comment