ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూరు పట్టణంలోని దళిత సంఘాల ఆధ్వర్యంలో బహుజన రాజు చత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీ గంటా సదానందం గారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మూగ ప్రభాకర్ గారు, ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు రింగుల భూషణ్, తలారి చందు గార్లు మాట్లాడుతూ శివాజీ మహారాజు 1630 లో పశ్చిమాన ఉన్న పూనా ప్రాంతంలో జన్మించాడని, ఆయన తల్లి జిజావు ‘మహార్” అంటే మాల కులానికి చెందినదని, తండ్రి షాహాజీ రాజే “కున్బీ “అంటే కాపు కులానికి చెందిన వారు వీరిరువురు ఆ కాలంలోనే కులాంతర వివాహం చేసుకున్నారని వారి సంతానమే శివాజీ మహారాజ్ అని చెప్పారు. శివాజీ మహారాజ్ గురువులు వారి తల్లిదండ్రులు లేనని, వీరి ప్రోత్సాహంతోనే మొగులాయి సైన్యమును ఓడించి స్వదేశీ మారాట సామ్రాజ్యమును స్థాపించాడని, మనుధర్మ శాస్త్రం ప్రకారం శివాజీ శూద్రుడని రాజుగా అంగీకరించక పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణ సమాజం నిరాకరించిందని, అయితే కాశీ నుండి గంగా బట్ అనే బ్రాహ్మణుడికి తన నిలువెత్తు బంగారము వజ్ర వైడూర్యాలు ఇస్తే ఆ బ్రాహ్మణుడు శివాజీ (చాయ) నీడ మీద నుదుటిపై కాళీ బొటన వేలుతో తిలకం పెట్టి పట్టాభిషేకం చేసి, అవమాన పరిచారని, శూద్రుడు రాజు కాలేడని ఆయనను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఇప్పుడు ఒక మతానికి ప్రతీకగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. శివాజీ అందరివాడని ఒక కులానికి చెందిన వాడు కాదని ఆయన కాలంలో అన్ని కులాలకు భూములు పంచి, దళితులకు స్త్రీలకు, ముస్లింలకు సమాన గౌరవమిచ్చి తమ సైనికులుగా జాకీర్దారులుగా చేశాడని కొనియాడారు, శివాజీ నిజమైన చరిత్రను గ్రామ గ్రామాన బహుజన అందరికి తెలుపుతూ ,ఆయన జయంతి వేడుకలను అందరూ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీచర్ భోజన్న, ఎల్ టి కుమారస్వామి, రాజబాబు, పింజ అశోక్, కోటేశ్వర్, రాజా గంగారం, జే న్న పెళ్లి రంజిత్, వేన్న రమేష్, మారాట రాజు, సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు….
9440023558
Leave a comment