న్యూఢిల్లీ( తెలంగాణ వార్త )ఎం బి బి ఎస్ లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు రూమ్ మెంట్స్ తెలిపారు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (ఎం ఏ ఎం సి )చెందిన 19 ఏళ్ల వైద్య విద్యార్థి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది .కాలేజీ లోని ఉమెన్స్ హాస్టల్ లో యువతి తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దివ్య యాదవ్ గా గుర్తించారు డిసెంబర్ 29 సాయంత్రం విడుదలైన మెడికల్ విద్య పరీక్ష ఫలితాల్లో 2 పేపర్ లో ఫెయిల్ అయింది .అప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌తో ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం 64వ నెంబర్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె గదిలో మొబైల్ ఫోన్ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు ..మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె తండ్రికి అప్పగించారు ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Leave a comment