Home హాట్ న్యూస్ ఆధార్ లో ఇంటిపేరు మార్పిడి కోసం దరఖాస్తు ఇలా చేసుకోండి.
హాట్ న్యూస్

ఆధార్ లో ఇంటిపేరు మార్పిడి కోసం దరఖాస్తు ఇలా చేసుకోండి.

హైదరాబాద్, తెలంగాణ వార్త: దేశంలో ప్రతి పౌరుడికి అత్యంత ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డ్‌ ఒకటి. భారత ప్రభుత్వం జారీ చేసిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగి ఉన్న ఆధార్ కార్డు వివిధ సంక్షేమ పథకాలకు గుర్తింపుగా ఉపయోగపడుతుంది.
12అంకెల ఆధార్ నెంబర్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తుంది. బ్యాంకు ఖాతా తెరవడం లేదా ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టడం లేదా జాతీయ పథకాలను పొందడం వంటి అనేక కార్యకలాపాలను నిర్వహించడానికి ఆధార్ కార్డ్ అవసరం.

ఆధార్ కార్డ్‌లో వ్యక్తులకు సంబంధించిన సరి అయిన వివరాలు ఉంటాయి. ఏవైనా మార్పులు ఉన్నట్లయితే సకాలంలో అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మహిళలు వారి వివాహం తరువాత ఇంటి పేరు మార్చాల్సి వస్తుంది. కొంతమంది మాత్రం తమ ఇంటి పేరును అలాగే కొనసాగిస్తారు. కానీ వివాహం తర్వాత ఆధార్ కార్డ్‌లో తమ ఇంటిపేరును మార్చుకోవాలనుకునే వారికి సులభంగా మార్చుకునేలా UIDAI వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులు చేసింది.

ఆధార్ కార్డ్‌లో ఇంటిపేరును మార్చుకోవడానికి సులభమైన పద్ధతులు..

  • ముందుగా UIDAI అధికారిక స్వీయ-సేవ అప్‌డేట్ పోర్టల్‌కు వెళ్లాలి.
  • పేరు, ఇంటి పేరును నమోదు చేయాలి.
  • స్వీయ-ధృవీకరించబడిన అవసరమైన పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • తరువాత సబ్మిట్‌పై క్లిక్ చేయడం ద్వారా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • OTP నంబర్‌ను ఎంటర్ చేయాలి.

సొంతంగా పోర్టల్ ద్వారా పేరు మార్చుకోవడానికి UIDAI ఎలాంటి ఫీజు వసూలు చేయదు.

అదే ఆఫ్‌లైన్‌లో ఇంటిపేరును మార్చుకోవాలంటే సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. వివాహ ధృవీకరణ పత్రం వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాలి. ఆఫ్‌లైన్‌ ద్వారా పేరు మార్పు కోసం రూ. 50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page