- మానవత్వం చాటుకున్న మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్
అనాధ శవా అంతక్రియలు నిర్వహించిన ఎం పి జే నాయకులు
– మానవత్వం చాటుకున్న మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్
నిజామాబాద్,: తెలంగాణ వార్త::
నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండేళ్లుగా చికిత్స పొందుతూ, 13 జులై 2024న మరణించిన ఓ వృద్ధ ముస్లిం అనాధ శవాన్ని ఎం పి జే (మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్) నిజామాబాద్ శాఖ నాయకులు మానవత్వంతో కఫన్, నమాజే జనాజా చేసి ఖాబ్రస్తాన్‌లో తద్ఫీన్ చేయించి వారి మానవతా సేవను చాటుకున్నారు.
ఈ వృద్ధుడు జనవరి 2022లో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ, కుటుంబ సభ్యులు లేకుండా మరణించ విషయాన్నీ పోలీసుల ద్వార ఎం పి జే సభ్యుల కు సమాచారం అందగానే కఫన్ దఫాన్ కార్యక్రమన్ని గురువారం ముస్లిం సంప్రదాయాల ప్రకారం కఫన్ నమాజే జనాజా కార్యక్రమం నిర్వహించాక, ఖాబ్రస్తాన్‌లో తద్ఫీన్ చేశారు.
ఈ సందర్బంగా ఎం పి జే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ, ఖాబ్రస్తాన్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ బజర సహకారం ద్వారా ఈ సేవ కార్యక్రమం సజావుగా జరిగిందని చెప్పారు.
ఈ సేవా కార్యక్రమంలో జడ్ పి మాజీ కో-ఆప్షన్ సభ్యుడు షేక్ మొయిజ్, ఎం పి జే సభ్యులు షకీల్, అన్వార్ అలీ, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment