డొంకేశ్వర్, అలూర్ మండలాలకు గ్రీన్ సిగ్నల్
నందిపేట్. తెలంగాణ వార్త::
పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది . రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇప్పటికే నూతన జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు లిస్ట్ లో పెరు వచ్చి చివరి క్షణము లో ఆగిన డొంకేశ్వర్, అలూర్ మండలాలకు శనివారం గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఆర్ముర్ నియోజక వర్గం లో పై రెండు మండలాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఇక్కడి ప్రజల నుంచి వెల్లువెత్తాయి. స్థానిక ఎం ఎల్ ఏ, పి యు సి చైర్మన్ జీవన్ రెడ్డి ఇట్టి విషయాన్ని పలుమార్లు సీఎం కేసీఆర్ ను కోరగా సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.,
.
రెండు మండలాలకు గ్రీన్ సిగ్నల్
ఆర్ముర్ నియోజకవర్గంలో డొంకేశ్వర్, అలూర్ రెండు నూతన రెవెన్యూ మండలాల ఏర్పాటుకు సంబంధించి శనివారం ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త రెవెన్యూ మండలాల్లో ప్రతిపాదిత గ్రామాలు:
- ఆలూర్ లో
ఆలూర్,మిర్దాపల్లి,దేగావ్, మాచర్ల, గగ్గుపల్లి,రాంపూర్, సిద్దాపూర్, వన్నెల్ (కె), కల్లడి, గుత్ప - డాంకేశ్వర్ లో
డోంకేశ్వర్,తొండకూర్, దత్తాపూర్, గంగాసముందర్ , సిర్పూర్, అన్నారం, మారంపల్లె, నూత్పల్లి ,నడకుడ
గాదెపల్లె, కోమట్పల్లె, నికల్పూర్
డొంకేశ్వర్ లో పండుగ వాతావరణం.
గోదావరి ముంపు గ్రామమైన డొంకేశ్వర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించడంతో డొంకేశ్వర్ గ్రామములో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. 12 గ్రామాలను కలుపుతూ నూతన మండలం గా డొంకేశ్వర్ ను మండల కేంద్రం గా చేయడం పట్ల యువకులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకొని తిన్నారు. అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు
ముఖ్య మంత్రి కి ధన్యవాదాలు.
…జీవన్ రెడ్డి, పి యు సి చైర్మన్, ఆర్ముర్ ఎం ఎల్ ఏ.
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్ , డొంకేశ్వర్ నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు, ఇట్టి శుభ సందర్భంగా నియోజక వర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కెసీఆర్ కి, మంత్రివర్యులు కేటీఆర్ కి ధన్యవాదాలు
Leave a comment