దండుమల్కాపూర్ ను దత్తత తీసుకుంటున్నా
-నూరు శాతం అభివృద్ధి బాధ్యత నాదే
-ఇది కాంట్రాక్టర్ కు,క్యారెక్టర్ ఉన్న నేతకు మధ్య యుద్ధం
-రాజగోపాల్ రెడ్డి అమ్ముడుబోయిండు
-మునుగోడు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు
-బీజేపీని తరిమికొడదాం
-50వేల మెజారిటీ తో టీఆర్ ఎస్ గెలుపు ఖాయం
-సకల జనులంతా సారు, కారు, కేసీఆర్ వైపే
-గుజరాతీ మోడల్ దండగ..కేసీఆర్ మోడల్ పండగ
-ఎన్నిక ప్రచార సభలో పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి
దండు మల్కాపూర్/ఆర్మూర్,అక్టోబర్25:- తెలంగాణ వార్త
దండుమల్కాపూర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నానని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, దండుమల్కాపూర్ టీఆర్ ఎస్ ఎన్నికల ఇంచార్జి ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలో మునుగోడు నియోజకవర్గ టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం దండు మల్కాపూర్ లో పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ ఎన్నికల ప్రచార సభ జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి, అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ దండుమల్కాపూర్ గ్రామాన్ని నూటికి నూరుశాతం అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని విస్పష్టంగా చెప్పారు. ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని మైసమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని జీవన్ రెడ్డి అన్నారు.
ఇది డబ్బు సంపాదన తప్ప ఏనాడు ప్రజలను పట్టించుకోని ఒక కాంట్రాక్టర్ కు, నిత్యం ప్రజల మధ్యే వుండే క్యారెక్టర్ ఉన్న నేతకు మధ్య జరుగుతున్న యుద్ధం. రాజగోపాల్ రెడ్డి 18వేల కోట్ల రూపాయలకు అమ్ముడు బోయిండు. అమ్ముడు పోవడానికి ఆయన బర్రెనా?.గొర్రెనా?. మునుగోడు ఆత్మ గౌరవాన్ని బీజేపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిండు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు కోవర్ట్ బ్రదర్స్. రాజగోపాల్ రెడ్డి ఏనాడైనా మీ ఊరొచ్చిండా?.మీ వాడకొచ్చిండా? మీ మంచి,చెడు చూసిండా? అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇయ్యాల బాలమ్మ అనే తల్లి కనబడితే అడిగా..జనమంతా సారు, కారు,కేసీఆర్ వైపే ఉన్నారని చెప్పింది. నా కొడుకే నాకు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పింది. నా పెద్దకొడుకు కేసీఆర్ మాత్రం ప్రతీ నెలా రూ.2016 చొప్పున పెన్షన్ ఇస్తున్నాడని చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం దండుమల్కాపూర్ గ్రామంలో కేసీఆర్ పెద్దన్నగా 1730మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నారు. మేనమామగా ఒక లక్షా116 రూపాయల చొప్పున 121మంది పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేయడానికి కల్యాణ లక్ష్మీ పథకాన్ని ఇచ్చారు.21మంది రైతులకు రైతుబీమా పథకం కింద రూ.5లక్షల రూపాయల చొప్పున డబ్బులొచ్చాయి. దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు కోల్పోయిన 431మందికి ఒక గుంట చొప్పున ఇండ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చే బాధ్యత నాదేనని మైసమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నా. దండుమల్కాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేదంటే అప్పటికప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో మాట్లాడి ఈ గ్రామానికి బస్సులు వేయించా. ఈ గ్రామంలో విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి నల్లగొండ జిల్లా లక్ష్మీ పుత్రుడు. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ ఎస్ ను గెలిపించుకొని వచ్చే చరిత్ర ఆయనది. దండుమల్కాపూర్ లోని చెరువులు కలుషితం కాకుండా చర్యలు తీసుకొనే బాధ్యత నాదే. గ్రామంలో ఉన్న 130 ట్రాక్టర్ల కు పని కలిపించి ట్రాక్టర్ల యజమానులకు అండగా నిలుస్తాం అని జీవన్ రెడ్డి ప్రకటించారు. బీజేపీని తరిమికొడదామని ఆయన పిలుపునిచ్చారు.
50వేల మెజారిటీ తో టీఆర్ ఎస్ గెలుపు ఖాయమన్నారు.
సకల జనులంతా సారు, కారు, కేసీఆర్ వైపే ఉన్నారని, బీజేపీ, కాంగ్రెస్ లు తోక ముడిచి పలాయనం చిత్తగించక తప్పదన్నారు.
గుజరాతీ మోడల్ దండగ..కేసీఆర్ మోడల్ పండగ అని ఆయన వ్యాఖ్యానించారు. రూ.2016 చొప్పున పెన్షన్లు ఇచ్చే కేసీఆర్ మోడల్ కావాలా?.రూ.600 చొప్పున పెన్షన్లు ఇచ్చే గుజరాత్ మోడల్ కావాలా?.పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేసుకోవడానికి ఒక లక్షా116 రూపాయల చొప్పున ఇచ్చే కల్యాణ లక్ష్మీ పథకం అమలు చేస్తున్న కేసీఆర్ మోడల్ కావాలా?. నయా పైసా ఇవ్వని గుజరాత్ మోడల్ కావాలా?. రైతు బంధువులా ఎకరానికి రూ.10వేల చొప్పున ఇస్తున్న కేసీఆర్ మోడల్ కావాలా?. రాబంధువులా రైతులను కాల్చుకుతింటున్న గుజరాత్ మోడల్ కావాలా?అని ఆయన ప్రశ్నించగా సభికులంతా మాకు కేసీఆర్ మోడలే కావాలని పెద్దగా నినాదాలు చేశారు. తెలంగాణను ఆగం చేసే కుట్రతో బయలు దేరిన బీజేపీ రాకాసి మూకలను తెలంగాణ పొలిమేరలు దాటేవరకు తరిమికొట్టడానికి ప్రజలు సమాయత్తం కావాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని 50వేలకు పైగా మెజార్టీతో గెలిపించి ప్రజలంతా కేసీఆర్ నాయకత్వానికి అండగా నిలవాలని ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. విలేకరులకు మాత్రం ఫ్రీగా వారు వేసిన ఫోటోలు వార్తలు రాయకపోతే ఇక వారికే తెలుసు కూలిపోయిన పాత ఇండ్లలో ఉంటున్న జర్నలిస్టులకు గోడు ఎవరు వింటారు..
Leave a comment