ఆర్మూర్, తెలంగాణ వార్త: బీజేపీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఇంచార్జ్, ssk ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, క్షత్రియ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు శనివారం క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ ఎంపీ అరవింద్ ధర్మపురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలకు రావడం చాల సంతోషాదాయకమని,ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, అదేవిధంగా ఓటు హక్కును వినియోగించుకొని మంచి పరిపాలన దక్షత కలిగిన నాయకుడిని ఎన్నుకోవాల్సిన భాద్యత, దేశ భవిష్యత్తు యువత పై ఉందని చెప్పడం జరిగింది. శ్రీనన్న గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజ జీవితంలో మున్ముందు ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ అఫ్ నవనాథపురం వారి సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ గారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చెన్న రవి, సీనియర్ మెంబెర్ సుధీర్ బాబు, రూపాలి నర్సయ్య, రెడ్ క్రాస్ సిబ్బంది,ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రామ్ కింకర్ పాండే, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు, పార్టీ నాయకులు,భోదన మరియు భోదనేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Leave a comment