ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ వెల్లడి
తెలంగాణ వార్త : ఆర్మూర్ పట్టణ, పెర్కిట్, మమీడిపల్లి గ్రామల ప్రజలకు తెలియపరుచునది ఏమనగా! (OTS) వన్ టైం స్కీమ్ G.O.Rt.No.485, తేదీ:16.07.2022. ప్రకారము 2021-22 వరకు ఆస్తి పన్ను బకాయిలను పూర్తిగా చెల్లించిన వారికి 90% శాతం వడ్డీ మాఫీ కి ప్రభుత్వం ఆమోదించింది. ఇట్టి స్కీమ్ చివరి తేది 31.10.2022 వరకు మాత్రమే. కావున ఆర్మూర్ పట్టణ,పెర్కిట్, మమీడిపల్లి గ్రామాల ప్రజలు ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకొని 2021-22 ఉన్న ఆస్తి పన్ను బకాయిలను 90% వడ్డీ మాఫీతో చెల్లించగలరని మనవి.మున్సిపల్ కమిషనర్
పురపాలక సంఘం ఆర్మూర్
Leave a comment