ఆర్మూర్, తెలంగాణ వార్త:: శనివారం ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ లో రామ్ మందీరం నుండి ఆర్మూర్ ఇస్కాన్ అధ్వర్యంలో జగన్నాథ్ రథ యాత్ర అత్యంత అంగరంగ వైనవంగా హరి నమ సంకీర్తన గావిస్తు హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని జపిస్తూ భక్త బృందంతో జరిగిందని అందులో బాగంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి బంగారు చీపిరితో రోడ్డును శుభ్రం చేసి రథాన్ని లాగి రథ యాత్రను ప్రారంభించినారని ఇట్టి యాత్ర జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం మీదుగా గొల్బంగ్ల ద్వారా తిరిగి రామ్ నగర్ రామ్ మందిరం చేరుకొని మనిరములో కృష్ణ భగవానుని కి 108 రకాల నైవేద్యాలు సమర్పించి మంగళ హారతి గావించి ఆన్న ప్రసాదములు వితరణ చేయడం జరిగిందని ఇస్కాన్ ప్రతినిధి లయన్ నివేదన్ కొనియాడారు రథాన్ని లాగడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆంతర్యం ఏమిటనగా భగవంతుని మరిచిపోయిన మనకు తిరిగి రథాన్ని లాగడం ద్వారా భగవంతున్ని మన హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాము అనే అర్థం రథేచ వామనం దుష్ట పునర్జన్మన విద్యతే రథంపై ఆశీస్సుడైన శ్రీ జగన్నాథుని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు అనేటువంటి సందేశాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పడం జరిగిందని ఇట్టి రథ యాత్ర ద్వాపర యుగం నుండి ప్రారంభమయి నేటి వరకు కూడా నిర్విరామంగా కొనసాగడం విశేషం అని ఇస్కాన్ ప్రబుజీలు రామానంద రాయ్ మరియు ఆది పురుష దాస్ లు పేర్కొన్నారు ఆనంతరం రతయాత్ర లో పాల్గొన్న భక్తులకు ఆర్మూర్ ఇస్కాన్ ప్రతినిధులయిన లయన్ నివేదన్ గుజరాతి, నూకల విజయ్, లు ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు ఇట్టి కార్యక్రమంలో గంగామోన్ చక్రు కౌన్సిలర్ దొండి రమణ, డీజే దయానంద్, వందన లక్ష్మి నారాయణ, జి వి హరి దుర్గాప్రసాద్, డిజె శ్రీధర్ గుజరాతి గంగామోహన్, ధర్మేందర్ పోహార్ నగేష్ గుజరాతి గీత సవితాచక్రు గటడి రేఖ ఘటడి నిర్మల మరియు తదితరులు పాల్గొన్నారు
Leave a comment