ఆర్మూర్ ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన మధ్యాహ్న భోజన కార్మికులు
తెలంగాణ వార్త: ( ఆర్మూర్ ) ఆర్మూర్ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ధ్యాహ్నం ధ్యాహ్న భోజన కార్మిక సంఘం తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు ఒకటి నుండి సమ్మె చేస్తున్నట్టు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరి చక్రపాణి తెలిపారు. ఈ మేరకు శనివారం రోజు ఆర్మూర్ తహశీల్దార్ కు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం చక్రపాణి మాట్లాడుతూ జిల్లాకు గత మార్చి నుంచి జూలై 15 వరకు 10 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. వాటిని విడుదల చేయడంతో పాటు పెంచిన
2వేలు వేతనం అమలుకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఆర్మూర్ మండల కార్యదర్శి జక్కం సుజాత, యూనియన్ నాయకులు గంగాధర్, ప్రమీల, భాగ్యలత తదితరులు పాల్గొన్నారు.
Leave a comment