ఆర్మూర్, తెలంగాణ వార్త:
శుక్రవారం రోజు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తారకరామారావు(కేటీఆర్) గారి ఆదేశాల మేరకు, నిజామాబాద్ జిల్లా తెరాస రథ సారథి ఆర్మూర్ డైనమిక్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న గారి పిలుపు మేరకు, మన ప్రియతమ నాయకులు, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వరన్న గారి సూచన మేరకు ఈ రోజు తెరాస పార్టీ పట్టణ శాఖ తెరాస పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యములో కేంద్ర ప్రభుత్వం విధించిన GST కి వ్యతిరేకంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా మరియు రాస్తా రోఖో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో పార్టీ అధ్యక్షులు పూజ నరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా గార్లు మాట్లాడుతూ దేశ ప్రజలు కరోనా మహమ్మారి విస్పోటకం నుండి ఇంకా తేరుకోక ముందే నిత్యావసరాల సరుకుల పై GST అనే భూతాన్ని తీసుకువచ్చి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుంది ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఆరోపించారు. పాలు మరియు పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి GST పన్ను విధించడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రాస్తా రోఖో కార్యక్రమమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో తెరాస సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ పోల సుధాకర్, జనార్దన్ గౌడ్, పండిత్ పవన్, ఖాందేష్ శ్రీనివాస్, సుంకరి రవి, పండిత్ ప్రేమ్, gg రామ్ మున్సిపల్ కౌన్సిలర్లు సుంకరి రంగన్న, బండారి ప్రసాద్, మురళీధర్ రెడ్డి, SR రమేష్, రింగుల భూషణ్, శివ ప్రసాద్, తలారి చందు, యూత్ అధ్యక్షులు పృత్వి రాజ్ నాయకులు మల్యాల రాజా బాబు, సడక్ వినోద్ మీరా హన్మంతు, కొక్కెర భూమన్న, రోహిత్, మీరా శ్రావణ్, లతీఫ్, నాగరాజు, ఆత్మచరణ్ రాజారెడ్డి సుభాష్ గౌడ్ నరేష్ మేదరిమరియు రైతులు తదితరులు పాల్గొన్నారు
Leave a comment