ఆర్మూర్( తెలంగాణ వార్త )ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సు అతివేగం గాన నడపడంతో ఒకరు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం అంకాపూర్ గ్రామానికి చెందిన చల్ల గంగారెడ్డి(59) అక్కడికక్కడే మృతి చెందాడు. మోటార్ సైకిల్ నంబర్ టీఎస్ 16 ఈ యఫ్ 7208 గల దానిపై నుండి మునిపల్లి గ్రామానికి వెళ్లి వస్తుండగా అంకాపూర్ ఎస్బిఐ బ్యాంకు వద్ద జాతీయ రహదారి 63 రోడ్డుపై యూటర్న్ చేస్తుండగా అదే సమయంలో ఆర్మూర్ నుండి నిజాంబాద్ వైపు వెళ్తున్న ఆర్టిసి బస్సు నెంబర్ ఏపీ 29 జెడ్ 1890 గలదని డ్రైవర్ అతివేగం గా నడపడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. .మృతి భార్య చల్ల చిన్ని బాయ్ ఫిర్యాదు మేరకు ఆర్మూర్ సీఐ సైదేశ్వర కేసు ఉ ఉ నమోదు చేసినట్లు మీడియాతో తెలిపారు.
Leave a comment