ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల వివిధ వార్డులలో సమస్యలతో సతమతమవుతూవుతుంటే మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పట్టి పట్టించుకోనట్టు ఉండడం మున్సిపల్ వాసులు కమిషనర్ పై కార్పొరేటర్ లపై ఆగ్రహంతో ఉన్నారు .ప్రతి వార్డు లో ఏదో ఒక సమస్య ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉండడంతో ప్రజలు నిరుత్సాహ పడుతున్నారు ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నది తాము కష్టం చూడడానికా అన్నట్టు ఉందని మున్సిపల్ వార్డు ప్రజలు అంటున్నారు. ఎన్నుకున్న సభ్యులు కమిషన్ల తో జల్సాలు చేసు కొంటుంటే ప్రజల ఇబ్బందులు ప్రభుత్వ అధికారుల పైనే ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ వచ్చిన కానీ సమస్యలు ఎక్కడికక్కడే ఉండటంతో అలాగే రోజు ఉదయం కమిషనర్ గ్రామంలో రోజు ఒకసారి తిరుగుతుంటే సమస్యలు కంట్లో పడతాయని ఆర్మూర్ లోన చిన్న బజార్ లో అండర్ డ్రైనేజీ పనులతో తో భూమి లోపల పైపులు వేసి ప్రజల సొమ్మును భూమి పాలు చేశారని చేసిన వారిపై చర్యలు ప్రభుత్వ అధికారులు ఎందుకు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదని వీరు వాపోతున్నారు అండర్ డ్రైనేజీ పేరిట మ్యానువల్ లు వేశారు కానీ నీ అవి 6 నెలలు తిరగకుండానే పగిలిపోయి రోడ్డున నడిచే పాదచారులకు మరియు ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు అంటున్నారు మ్యాన్ హోల్ పగిలిపోయి ప్రజలు వస్తువు పోయే దారిలో ఉండడంతో దాంట్లో ప్రజల కాళ్లు పడి విరుగుతున్నాయని అయినా కమిషనర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వీరు కమిషనర్ పై కలెక్టర్ కు పిర్యాదు ఇవ్వనున్నట్టు తెలిపారు.
Leave a comment