ఆర్మూర్ (తెలంగాణ వార్త) ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రిలో 12 మందికికరోనా సోకినట్టు తెలిసింది. మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ కు జ్వరము రావడంతో ఆయన ప్రభుత్వాసుపత్రిలో టెస్ట్ చేయించు కోవడంతో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆయన రోజు నిజామాబాద్ నుండి ఆర్మూర్ కు రోజు రావడం పోవడం జరుగుతుంది అయితే ఆయన డెలివరీ చేసినప్పుడు మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ డెలివరీ అయ్యే 12 మందికి ఇంజక్షన్ చేసినట్ల తెలిసింది .వారికి కూడా టెస్టులు చేయగా వారికి పాజిటివ్ వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
అయితే ఆసుపత్రిలో పని చేసేవారు ఎంతమందికి కరుణ సోకింది అన్న దానిపై చర్చ నడుస్తుంది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది
Leave a comment