రామాయంపేట( తెలంగాణ వార్త) 15 సంవత్సరాల నుంచి 18 ఇది సంవత్సరాల వయస్సున్న వారికి టీకాలు వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించి పండ్లు పనిలో నిమగ్నమైంది. జనవరి 1 నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు .జనవరి మూడో తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు వైద్య శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీనికితోడు జిల్లాలో కరుణ మొదటిది వ్యాక్సినేషన్ 100% పూర్తి అవగా రెండో టీకా 86 శాతం పూర్తి చేసినట్టు డి ఎం హెచ్ ఓ వెంకటేశ్వరరావు తెలిపారు త్వరలో 100% పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. కరోనా వేరియంట్ ఓమీ క్రాన్ వ్యాపించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు జిల్లాలోని పాఠశాలలు ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాల అధికారులు యజమాన్యాలు నుంచి వివరాలు సేకరిస్తున్నారు అంతేకాకుండా బడిబయట ఉన్న పిల్లల వివరాలు సేకరించేందుకు జిల్లాలోని అంగన్వాడి ఆశావర్కర్లు లతో సర్వే చేయిస్తున్నారని డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు.
Leave a comment