హైదరాబాద్, తెలంగాణ వార్త ::తెలంగాణ రాష్ట్రంలో జేఎన్టీయూ పరిధిలోని ఆయా ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులకు జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు.
ఆగస్టు 2వ వారంలో ఇంజినీరింగ్ చివరి ఏడాది ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. చివరి ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థులకు వీలైనంత త్వరగా పత్రాలు ఇచ్చేందుకు పూర్తి ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ మాట్లాడుతూ..”చివరి ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థులకు వీలైనంత త్వరగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు జేఎన్‌టీయూ ఏర్పాట్లు చేస్తోంది. ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి లేదా ఎంటెక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. గత వారమే పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, వర్షాల కారణంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో జేఎన్టీయూ వాయిదా వేసింది. వీటిని మరో వారంలోపు ప్రారంభించాలని నిర్ణయించింది” అని ఆయన అన్నారు.
అనంతరం కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు ఆలస్యంగా జరుగుతూ వచ్చాయని, దీనివల్ల విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ట్రాన్స్ స్క్రిప్టులు అందక చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. ఈసారి సెమిస్టర్ వ్యవధిని సెలవులు లేకుండా యాజమాన్యం కొనసాగించిందని, జులైలో పరీక్షలు పూర్తి చేసి ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు ప్రకటించాలని ప్రణాళిక వేసుకున్నామని ఆయన అన్నారు. తాజాగా పరీక్షలు ఆలస్యం కావడంతో ఆగస్టు రెండో వారంలో ఫలితాలను ప్రకటించేలా జేఎన్టీయూ అధికారుల కసరత్తులు ముమ్మరం చేశారని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ వివరాలను వెల్లడించారు.
Leave a comment