Home హాట్ న్యూస్ కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించిన రైతు సంఘాలు.
హాట్ న్యూస్

కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించిన రైతు సంఘాలు.

ఆర్మూర్ ,తెలంగాణ వార్త:

కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించిన రైతు సంఘాలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన" కనీస మద్దతు ధర కల్పించటం కోసం నియమించిన కమిటీని బహిష్కరించాలని" సంయుక్త కిసాన్ మోర్చా" రైతు సంఘాలు నిర్ణయించాయి. మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకొని రైతు ఉద్యమాన్ని విరమించాలని కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను కోరిన సందర్భంలో గత సంవత్సరం నవంబర్ నెలలో , ఒక కమిటీని వేసి రైతు సంఘాల సూచన మేరకు" కనీస మద్దతు దలకు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సుమారుగా ఒక సంవత్సరం కాలయాపన చేసిన అనంతరం ఇటీవల రహస్యంగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ అనుకూల రైతు సంఘాల నుండి 26 మందిని నియమించి, కేవలం ముగ్గురు ప్రతినిధులను మాత్రమే సంయుక్త కిసాన్ మోర్చా నుండి తీసుకోవడానికి పేర్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరటం జరిగింది. ఇది కేవలం కాలయాపన చేసి ప్రభుత్వ సూచనలు ఆమోదం పొందాలనే దుష్ట బుద్ధితో 'MSP Guarante చట్టం ' ను పెట్టకూడదని ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వ చర్యలు ఉన్నాయి కాబట్టి ఇట్టి కమిటీలోకి రైతు ప్రతినిధుల నే పంపకూడదని జూమ్ ఈరోజు మీటింగ్ ద్వారా సమావేశమైన అఖిలభారత రైతు సంఘాలు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ భజన పరులతో కూడిన సభ్యులను తొలగించి, కొత్తగా సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులను ఎక్కువ సంఖ్యలో తీసుకొని "MSP గ్యారంటీ చట్టం" ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాము.

పత్రికా సమావేశంలో పాల్గొన్న నాయకులు
 కోటపాటి నరసింహం నాయుడు, అధ్యక్షులు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య,
 మిట్టపల్లి గంగారెడ్డి, ఉపాధ్యక్షులు తెలంగాణ పసుపు రైతుల సంఘం.
 నక్కల చిన్నారెడ్డి, అధ్యక్షులు ఆర్మూర్ డివిజన్ – పసుపు రైతుల సంఘం

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page