హైదరాబాద్ ( తెలంగాణ వార్త) : విద్యార్థులు రైల్వే శాఖకు సంబందించిన ఆస్తులు ధ్వంసం చేశారు. విద్యార్థుల ఆందోళన కారణంగా 20కోట్ల ఆస్థి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. నాలుగు రైళ్లకు నిప్పుపెట్టారు. బస్తాలు వేసి తగల పెట్టారు. ఆందోళన కారణంగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు దిగారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి అదుపు తప్పింది. ఇక చేసేది ఏమీ లేక.. ఆందోళనకారులపై పోలీసులు 20రౌండ్ల కాల్పులు జరిపారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు.. గాల్లో కాల్పులు జరుపుతున్నారు పోలీసులు. ఈ కాల్పుల్లో.. కొంత మంది ఆందోళన కారులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే.. కాసేపటి క్రితమే.. ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఒకటో నంబర్ ఫ్లాంట్ ఫాం దగ్గర ఓ యువకుడు.. పోలీసుల కాల్పుల్లో మరణించారని సమాచారం అందుతోంది. ఇక మరికొందరికి గాయాలు కావడంతో.. స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Leave a comment