భూతగాదాల వల్ల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్ నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కొండ రాంప్రసాద్(60) సం. రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. గత కొన్ని సంవత్సరాల క్రితం ఖానాపూర్ లో ఒక ఇల్లు కట్టుకొని అందులో తన కుటుంబ సమేతంగా జీవిస్తున్నాడు. అయితే అతని ఇంటి ముందు బని శెట్టి గంగ మల్లు అనే వ్యక్తి యొక్క ఇల్లు ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య రోడ్డు విషయంలో లో గొడవ జరిగింది. గొడవలు మనసులో పెట్టుకొని తేదీ 25.2.2022 న అందాజ సాయంత్రం ఐదున్నర గంటలకు గంగ మల్లు కర్రతో రాంప్రసాద్ తలపై కొట్టి చంపేశాడు.ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ పోలీసులు ఉన్నతాధికారులు అయిన నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్, నిజామాబాద్ రూరల్ సౌత్ సర్కిల్ సిఐ జగడం నరేష్, నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ లింబాద్రి ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చరీకి తరలించి, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వీరి మధ్య గత కొన్ని రోజుల నుంచి భూ తగాదాలు ఏర్పడ్డాయని, ఈ క్రమంలో గంగమల్లు, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ రాంప్రసాద్ పై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Leave a comment