Home హాట్ న్యూస్ బిజెపి పై నిప్పులు చెరిగిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
హాట్ న్యూస్

బిజెపి పై నిప్పులు చెరిగిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.బీజేపీది రౌడీయిజం-మాది కేసీఆరిజం
-మోడీది జనకంఠక పాలన
-రైతులను హింసిస్తున్నారు
-పంజాబ్ కో నీతి మాకో నీతా?
-ఇక దేశం కోసం టీఆర్ ఎస్ పోరు
-ఢిల్లీ కోటను కూలుస్తాం
-బండి కాదు తొండి సంజయ్
-ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ ఎంపీ అరవింద్
-మీది కేసీఆర్ ను అనే స్థాయా?
-నిప్పులు చెరిగిన జీవన్ రెడ్డి
నిజామాబాద్, మార్చి24:-
“దేశంలో బీజేపీది రౌడీయిజం. తెలంగాణ రాష్ట్రంలో మాది కేసీఆరిజం. బీజేపీ రౌడీయిజం నిలువునా ముంచడం.అంబానీ, ఆదానీల ఆస్తులు పెంచడం. కేసీఆరిజం అంటే రాష్ట్ర సంపద పెంచడం.తిరిగి ఆ సంపదను దళిత,గిరిజన, బీసీ ,మైనారిటీ వర్గాలకు పంచడం.
బీజేపీ రైతు వంచక పార్టీ. మోడీది జనకంఠక పాలన
కేంద్ర పాలకులు రైతులను హింసిస్తున్నారు.ఒకప్పుడు అన్నమో రామచంద్రా అంటూ వలసలు పోయిన ఘోరమైన చరిత్ర తెలంగాణది.ఇప్పుడు స్వరాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ ముందు చూపు పాలనతో దేశానికే అన్నం పెడుతున్నది. అలాంటి తెలంగాణ పై మోడీ ప్రభుత్వం కక్షగట్టింది.కనికరం కూడా లేకుండా తెలంగాణ రైతులను వేదిస్తున్నది. వడ్ల కొనుగోలు లో రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారు.
పంజాబ్ కో నీతి మాకో నీతా?.ఇక కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలను కూడగట్టి దేశం కోసం టీఆర్ ఎస్ పోరాడుతుంది.ఢిల్లీ కోటను కూలుస్తాం” అని పీయూసీ ఛైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. నిజామాబాద్ నగరంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతేడ్చిన రాజ్యం,ఎద్దేడ్చిన వ్యవసాయం బాగు పడదన్నారు. 2కోట్ల20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటున్నారని, దేశాన్ని సాకుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణపై వివక్ష చూపుతున్నారని ఆయన కేంద్రం పై ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ 23లక్షల కోట్లు పిండుకున్నారని,11నుంచి 13 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన బ్యాంకు రుణాల ఎగవేత దారులను, వైట్ కాలర్ నేరస్తుల ను, ఆంగ్లంలో “ఎ ” నుంచి “జడ్ ” వరకు కుంభకోణాలకు పాల్పడిన అవినీతి పరులకు అండగా ఉన్న మోడీ ప్రభుత్వం రైతులకు మాత్రం ద్రోహం చేస్తూ వారి వెన్ను విరుస్తున్నదని జీవన్ రెడ్డి మండి పడ్డారు. రూ.2,016/3,016ల చొప్పున ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం.కళ్యాణ లక్ష్మీ ద్వారా రూ.1,00,116ల చొప్పున ఇస్తూ ఇప్పటికే పది లక్షల మంది కి పైగా పేదింటి ఆడ పిల్లల పెండ్లిండ్లు చేసాము. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.10,000ల చొప్పున ఇప్పటికే 50వేల కోట్ల రూపాయల ను రైతుల ఖాతాల్లో జమ చేశాము. రైతు ప్రమాద వశాత్తు చనిపోతే రూ.5,00,000ల చొప్పున చెల్లించే బీమా అమలు చేస్తున్నాం. రూ 12,000/13,000ల చొప్పున కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం.మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి నీళ్లిస్తున్నాం. ఇరవై నాలుగంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం
గురుకులాలు 1000 ఏర్పాటు చేసాం.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలకు నీళ్లిచ్చే దిశగా పోతున్నాం. వీటిలో దేనిలోనూ నయా పైసా కేంద్రం వాటా లేదు. కనీసం వీటిలో ఒక్క పథకమైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా?” అని జీవన్ రెడ్డి నిలదీశారు. రైతులతో పెట్టుకున్నోడు, కేసీఆర్ తో గోక్కున్నోడెవడూ బాగుపడలేదన్నారు.
ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎర్ర జొన్న రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిలో కలిసిపోయిందన్నారు
బషీర్ బాగ్ చౌరస్తాలో కరెంటు అడిగిన రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన టీడీపీ ప్రభుత్వం హతమై టీడీపీ ఆఫీసు కు టూ-లెట్ బోర్డు పడిందన్నారు.చంద్రబాబు నాయుడును తెలంగాణ రైతులు తరిమి కొట్టారన్నారు. మూడు నల్ల చట్టాలను రైతుల దెబ్బకు ప్రధాని మోడీ రెండు చెంపలేసుకొని క్షమాపణలు చెప్పారన్నారు. రైతులతో పెట్టుకున్న బీజేపీ పంజాబ్ లో నామరూపాలు లేకుండా పోయిందన్నారు.
కాగా బండి కాదు తొండి సంజయ్.ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ ఎంపీ అరగుండు అరవింద్ .వీరికి కేసీఆర్ ను అనే స్థాయి ఉందా.
నిన్న ఈ ఇద్దరూ సభ్యత ,సంస్కారం లేకుండా సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు వాగారు.
వడ్లు కొంటారో, లేదో చెప్పమంటే అది చెప్పరు. ఢిల్లీ పోయి రైతుల తరపున మాట్లాడరు.నోరు తెరిస్తే సొల్లు పురాణం
అరవింద్ ఫాదర్ ఆఫ్ లయ్యర్.ఫేక్, ఫ్రాడ్,ఫాల్స్ ఎంపీ. అరవింద్ .నీది నోరా..మురుగుడు కంపు కొట్టే మోరియా
నీది నాలుకా తాటి మట్టా.నిన్ను నీ అయ్యమ్మలు గాలికి వదిలేసిండ్రు.నీకు సంస్కారం నేర్పలే.
రైతును ముంచిన వంచకుడివి. పసుపు బోర్డ్ తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చావు. పసుపు బోర్డ్ తేలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి పసుపు రైతుల ఉద్యమంలో పాల్గొంటానన్నావు.
రోజులైనా పసుపు బోర్డ్ తేలేక పోయావు.రైతులను నట్టేట్లో ముంచిన నయవంచకుడివి
నువ్వు. నువ్వా కేసీఆర్ ను విమర్శించేది.బండి సంజయ్.నీ తొండి మాటలు కట్టి పెట్టు. మీ ఇద్దరికీ చీము నెత్తురు ఉంటే ఢిల్లీ వెళ్లి వడ్ల కొనుగోలు కు 12వేల కోట్ల రూపాయలు సాధించి మాట్లాడండి”అని జీవన్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు గారు,అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ గారు రెడ్కో చైర్మన్ అలీం గారు, NUDA ప్రభాకర్ గారు మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు…

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page