ఆర్మూర్ (తెలంగాణ వార్త )ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో జాతీయ రహదారి నీ ఆనుకొని ఉన్న ఖోకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసి వేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలంగాణ వార్త తో మాట్లాడుతూ తెలిపారు. మంగళవారం జరిగిన తొలగింపు కార్యక్రమం లో గందరగోళం ఏర్పడటంతో వాయిదా వేసుకుని రేపు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకు ఆనుకొని ఉన్న ఖోకాలను తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. తమ సిబ్బందితో పాటు పోలీసులు కూడా అండగా ఉంటారని ఎవరు అడ్డొచ్చిన ఆగేది లేదని జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని దాదాపు 90 శాతం పూర్తయిందని కమిషనర్ తెలిపారు. రోడ్డును వెడల్పు చేస్తే యాక్సిడెంట్లు కావన్న ఉద్దేశంతో తో ఈ స్పెషల్ డ్రైవ్ తీసుకున్నట్టు ఆయన అన్నారు. ప్రజల బాగోగులు చూడడానికి తాము ఉన్నామని ప్రజలకు ఇబ్బంది కలగకుండా అలాగే స్కూలు పిల్లలకు కు భద్రత ఉంటుందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలంగాణ వార్త తో వెల్లడించారు.
Leave a comment