తెలంగాణ వార్త ; (బాల్కొండ) బాల్కొండ మండలం కిసాన్ నగర్ 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 4: 30 గంటల సమయంలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కంటైనర్ ఢీ కొట్టింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్సై గోపి సంఘటన వివరాలను తెలిపారు. ప్రమాదం గల కారణాలను తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వాహనాలను బాల్కొండ, కిసాన్ నగర్ ముప్కాల్ గ్రామాల ద్వారా దారి మళ్లించారు. మృతి చెందిన మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంచనామా నిమిత్తం మృతుదేహాల్ని తరలించినట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Leave a comment