ఆర్మూర్, తెలంగాణ వార్త:: ఆర్మూర్ పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఆఫీస్ టేబుల్స్ మరియు కుర్చీల వితరణ కార్యక్రమము శనివారం చేపట్టడం జరిగిందని అధ్యక్షులు చేపూర్ గణేష్ ,కార్యదర్శి బుషం ప్రతాప్ లు తెలిపారు. అనంతరం డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ టేబుల్స్ కుర్చీలు అందజేసిన గ్రీన్ లైన్స్ క్లబ్ వారికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు. తదoతరం చార్టర్ అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మాస్కులు, సనిటైజార్లు, PPE కీట్స్ లను కూడా క్లబ్ ద్వారా అందజేయడం జరిగిందని డాక్టర్స్ డే కార్యక్రమంలో ఆసుపత్రి లో వెళ్ళినప్పుడు ఫర్నిచర్ కూడా అవసరం వుందని సుపరిండేoట్ డాక్టర్ నాగరాజు మా దృష్టికి తేవడం జరిగిందని దానిని వెంటనే స్పందించి ఇట్టి కార్యక్రమము చేపట్టడం జరిగిందని కొనియాడారు ఇట్టి కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ గా ఆకుల రాజు వ్యవహరించడం జరిగిందని మరియు ఇట్టి కార్యక్రమంలో లైన్స్ క్లబ్ గ్రీన్ ప్రతినిధులు రాజుల దేవి రామకృష్ణ ఎండి నసురుద్దీన్ ఆసుపత్రి డాక్టర్స్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Leave a comment