ఆర్మూర్ ,తెలంగాణ వార్త :గతములో ఎన్నడూ లేనివిధంగా, అత్యధిక మొత్తములో CMRF నిధులను మంజూరు చేస్తున్న ఘనత తెరాస రథ సారథి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దే. ఆర్మూర్ పట్టణం వడ్డెర కాలోనిలో నివసించే పల్లపు లక్ష్మి జిరాయత్నగర్ కు చెందిన ఆండ్రాసి చిన్నయ్య , మరియు కుమార స్వామి లు ఇటీవల అనారోగ్యము వల్ల అసుపత్రిలో చికిత్స కోసం అయిన బిల్లును PUC చైర్మన్, తెరాస జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి CMRF నిధుల నుండి 23000/- రూ 14500/- రూ 50,000/- రూ,, లు మంజూరు చేయించగా, ఈరోజు అట్టి చెక్ లని లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందచేయడం జరిగింది. చెక్కులు తీసుకున్న బాధిత కుటుంభ సభ్యులు జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపినారు. ఈ సందర్భముగా మున్సిపల్ కౌన్సిలర్, బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ ఎవరికీ ఏ ఆపద వచ్చినా మేమున్నాం అని భరోసా ఇస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే, PUC చెర్మన్ జీవన్ రెడ్డి చేసే మేలు పేద ప్రజలకు కొండంత అండ లభిస్తుందని అని అన్నారు. ఈ కార్యక్రమములో తెరాస నాయకులు ఖాందేష్ సత్యం, జాగృతి నియోజక వర్గ కన్వీనర్ మక్కల సాయినాథ్, నరేష్, శరత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment