Home హాట్ న్యూస్ మళ్లీ కేసీఆర్ సీఎం అవుతాడు..
హాట్ న్యూస్

మళ్లీ కేసీఆర్ సీఎం అవుతాడు..

Puc చైర్మన్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి జోస్యం:.:

-ఆయన పేద ,బడుగు వర్గాల ఆశాజ్యోతి

-గల్లీ నుంచే ఢిల్లీ వరకు పోరాడిన యోధుడు

-కేసీఆర్ పాలనతో అభివృద్ధి పధంలో తెలంగాణ

-నీళ్లు, నిధులు, నియామకాల కల సాకారమైంది

-తెలంగాణ పథకాలు మరే రాష్ట్రంలోనైనా ఉన్నాయా?

-“పల్లెప్రగతి” తో గ్రామాలు కళ కళ లాడుతున్నాయి

-ప్రాజెక్టులతో పెరిగిన ప్రజా సంపద

-క్రీడలకు అధిక ప్రాధాన్యత

-అందుకే గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలు

–వచ్చే ఆవిర్భావ దినోత్సవం నాటికి తీరనున్న మరిన్ని కష్టాలు

-సకలజనులంతా “సారు”కు అండగా నిలవాలి

-ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

  • మాక్లూర్, తెలంగాణ వార్త:: గుత్ప గ్రామంలో క్రీడా ప్రాంగణానికి ప్రారంభోత్సవం

ఆర్మూర్, జూన్2:- తెలంగాణ వార్త
తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగి పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజల జీవితాలలో శాశ్వత వెలుగులు ప్రసారించాలంటే మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం గుత్ప గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యతమిస్తూ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికెదిగేలా తీర్చిదిద్దుతున్నదన్నారు. గ్రామస్థాయి నుంచే క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడానికి, వివిధ క్రీడల్లో పాల్గొని యువత దేహ దారుఢ్యాన్ని పెంచుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నదన్నారు. ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గంలోని మూడు మండలాలలో ఎనిమిది క్రీడా ప్రాంగణాలను ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. గ్రామీణ యువత ప్రతీ రోజు ఈ క్రీడా ప్రాంగణాలకొచ్చి తమ దేహ దారుఢ్యాన్ని పెంచుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ” తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్ర సాధన 60ఏండ్ల కల. కేసీఆర్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు 14 ఏండ్లు పోరాడారు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని సమీకరించి,బోధించి, పోరాటానికి దిగారు. సకలజనులను ఒకే తాటిపైకి తీసుకువచ్చారు. అంబేద్కర్ స్పూర్తితో, గాంధేయ మార్గంలో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయ్యారు. పాలకుడిగా కేసీఆర్ ఉద్యమ కాలం నాటి నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ ను సాకారం చేశారు. ఆయన పేద ,బడుగు వర్గాల ఆశాజ్యోతి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నాం. దాదాపు 2లక్షల31వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం. వృద్దులు , వితంతు,గీత కార్మికులకు,ఒంటరి మహిళలకు, బోధ కాలు బాధితులకు, నేత కార్మికులకు, బీడీ కార్మికులకు రూ.2016 చొప్పున, వికలాంగులకు రూ.3016 చొప్పున ఆసరా పెన్షన్లు పంపిణీ అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్,
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్, అనంతసాగర్ ప్రాజెక్ట్, రంగనాయకసాగర్ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్ట్, భక్త రామదాసు ప్రాజెక్ట్, డిండి ప్రాజెక్ట్, ఎస్ ఆర్ ఎస్ పీ పునరుజ్జీవ పథకం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, అలీ సాగర్ ప్రాజెక్ట్, భీమా ప్రాజెక్ట్, నెట్టెంపాడు ప్రాజెక్ట్,నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,జోగులాంబ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెకులు నిర్మించడం ద్వారా భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చి ప్రజల సంపద లక్షల నుంచి కోట్లల్లోకి పెరిగింది. దళిత బంధు ద్వారా దళితుల్లో వెనుకబాటుతనాన్ని పారద్రోలుతున్నాం. రైతుబంధు ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఎవరైనా రైతు చనిపోతే 72 గంటల్లోగా ఆ రైతు కుటుంబానికి 5లక్షల రూపాయలను అందించే రైతుభీమా పథకాన్ని అమలు చేస్తున్నాం.
కల్యాణలక్ష్మి, షాదిముబారక్ ద్వారా పేదింటి ఆడ పిల్లల పెండ్లిండ్లు చేస్తున్నాం. హరితహారం, కెసిఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు అమలవుతున్నాయి.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతోంది.
24 గంటల కరెంట్ సరఫరా అవుతోంది. ఎస్ సీ ,ఎస్ టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ లోని అన్ని గ్రామాలలో, పట్టణాలలో పార్కులు,నర్సరీలు.
మినీ ట్యాంక్‌బండ్‌లు,
బస్టాండ్‌లు, సీసీ రోడ్లు,
లెడ్ వీధి దీపాలు,
బట్టర్ ఫ్లై లైట్లు, వైకుంట ధామాలు,డంప్ యార్డులు, చెత్త బండ్లు వంటి కార్యాక్రమాలతో గ్రామాలను, పట్టణాలను తీర్చిదిద్దుకున్నాం” అని జీవన్ రెడ్డి పేర్కొంటూ ఇన్ని పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు.కేసీఆర్ పాలనతో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. 70ఏండ్ల శని ఎనిమిదేండ్లలో పోతుందా? అని ప్రశ్నించిన ఆయన
వచ్చే ఆవిర్భావ దినోత్సవం నాటికి మరిన్ని కష్టాలు తీరనున్నాయన్నారు.
సకలజనులంతా కారు, సారు, కేసీఆర్ కు అండగా నిలవాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాస్త ప్రభాకర్, గ్రామ సర్పంచ్ చిన్నయ్య, టీఆర్ఎస్ పార్టీ మాక్లూర్ మండల అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జీవన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం గన్ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అమరవీరులకు నివాళులు అర్పించారు. పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాక ఆవిష్కరణ లో జీవన్ రెడ్డి పాల్గొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతినబూనారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page