తెలంగాణ మున్సిపాలిటీలు, పం చాయతీరాజ్, వ్యవసాయ శాఖల్లో వీళ్లను సర్దు బాటు చేసే అవకాశముంది. ఈ ఆప్షన్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీల్లో కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న వార్డు ఆఫీసర్ల బాధ్యతలను వీరికి అప్పగించాలనే ప్రతిపాదన ప్రభుత్వ అంగీకారం పొందిందని తెలుస్తోంది. దీంతో పాటు పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న చోట్ల పంచాయతీ సెక్రటరీలుగా, బిల్ కలెక్టర్లుగా, వ్యవసాయ శాఖలో వ్యవసాయ సహాయ విస్తరణ అధికారులకు (ఏఈవో) చేదోడు వాదోడుగా పంటల సాగు వివరాలు రికార్డు, పంట నష్టం వివరాలు నమోదు చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని ఆలోచిస్తోంది.
‘రెవెన్యూలోనే కొనసాగించాలి’ తగ్గేదే లే..
తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని వీఆర్వోల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్ హోదాలో తమ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాయి. ఇది సాధ్యం కాదంటున్న ప్రభుత్వ వర్గాలు తొలుత వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న చోట్ల వీరిని అలాట్ చేయాలని నిర్ణయించింది. వీఆర్వోలకు ఆప్షన్ ఇచ్చి ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించాలన్న ట్రెసా విజ్ఞప్తి మేరకు ఈ ఆప్షన్ ప్రక్రియకు అంగీకరించినట్టు సమాచారం.
Leave a comment