Home హాట్ న్యూస్ హైదరాబాద్ కనిష్ట వేగం పెద్ద రోడ్లలో 50:: పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్.
హాట్ న్యూస్

హైదరాబాద్ కనిష్ట వేగం పెద్ద రోడ్లలో 50:: పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్.

వాహనదారులకు భారీ ఉపశమనం

హైదరాబాద్ తెలంగాణ వార్తలుతాజా సమీక్షలో వాహనదారుల కోణంపై దృష్టిపెట్టాం. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన వేగపరిమితి ఉండడం వం టి ఇబ్బందులను గుర్తించాం. అందుకే.. డివైడర్లు ఉన్న రోడ్లు, డివైడర్లు లేని రహదారులు, మునిసిపల్‌ రోడ్లలో కేటగిరీల వారీగా ఏకీకృత వేగపరిమితిని అమలు చేయాలని నిర్ణయిం చాం. జరిమానాల విషయంలోనూ వాహనదారులకు భారీగా ఉపశమనం కలగనుంది. అంతేకాదు.. 40కిమీ వేగ పరిమితి ఉన్న చోట్ల ఇప్పటి వరకు ఉన్న చలానా వ్యవస్థలో స్పీడ్‌ లేజర్‌గన్‌లో 40.01, 40.50… ఇలా మార్జినల్‌ వేగం పెరిగినా చలానా జనరేట్‌ అయ్యేది. ఇకపై వేగపరిమితిలో 10ు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. అంటే.. 50కిమీ వేగపరిమితి ఉన్న చోట.. వాహనదారుడు 55 కిమీ వేగంతో వెళ్లినా, చలానా విధించబోము. అదే సమయంలో అతి నిర్లక్ష్యం, అతి వేగానికి జరిమానాల మొత్తం పెరుగుతూ ఉంటుంది.

వాహనదారులకు భారీ ఉపశమనం

ప్రస్తుతం అన్ని రోడ్లపై వేగ పరిమితి అన్ని రకాల వాహనాలకు ఒకేలా ఉంది. ఉదాహరణకు 40 కిలోమీటర్ల పరిమితి బోర్డు ఉన్న చోట.. కారైనా, లారీ అయినా.. ద్విచక్రవాహనమైనా ఆ వేగాన్ని దాటితే చలానా విధించేవారు. తాజా సమీక్షలో రోడ్ల ను మూడు కేటగిరీలుగా విభజించారు. అవి.. డివైడర్లు ఉన్న రహదారులు, డివైడర్లు లేని రోడ్లు, మునిసిపల్‌ రహదారులు. డివైడర్లు ఉన్న అన్ని రోడ్లలో కార్లకు వేగ పరిమితిని గంటకు 60కిమీగా నిర్ణయించారు. ఇతర వాహనాలు (భారీ, మధ్యస్థ, ఆటోరిక్షాలు, ద్విచక్రవాహనాలు) 50 కిమీ వేగాన్ని దాటకూడదు.

డివైడర్లు లేని రోడ్లలో కార్లకు 50కిమీ, ఇతర వాహనాలకు 40కిమీ వేగపరిమితిని నిర్ణయించారు. మునిసిపల్‌ రోడ్లు.. అంటే కాలనీల అంతర్గత రహదారుల్లో ఏ వాహనమైనా 30 కిలోమీటర్ల వేగాన్ని దాటకూడదు. ఇప్పటి వరకు ఏ వాహనానికైనా అతి వేగానికి జరిమానా రూ. 1,000గా ఉంది. ద్విచక్రవాహనదారుడైనా.. 40కిమీ పరిమితి ఉన్న చోట స్పీడ్‌ లేజర్‌గన్‌లు 40.01 కిమీ వేగాన్ని గుర్తించినా.. రూ. 1,000 చేతి చమురు వదిలేది. ఇకపై ఆ మొత్తాన్ని భారీగా తగ్గించాలని నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకు రూ. 300, కార్లకు రూ. 500 చొప్పున జరిమానా విధించాలని తీర్మానించింది. ఇలా కేటగిరీల వారీగా వేర్వేరు మొత్తాల్లో జరిమానాలు ఉంటాయి.

మరీ వేగంగా వెళ్తే.. బాదుడు తప్పదు

ద్విచక్ర వాహనదారులకు రూ. 300 జరిమానా అంటే ప్రస్తుత చలానాలతో పోలిస్తే.. భారీ ఉపశమనమే. అయితే.. ఇది వేగాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు 50 కిమీ పరిమితి ఉన్న రోడ్డుపై ఒక ద్విచక్రవాహనదారుడు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తే.. జరిమానా పెరుగుతుంది. 100 కిలోమీటర్ల వేగానికి రూ. 700 జరిమానా ఉంటుంది. ఆటోరిక్షాలు, కార్లు, లారీలు(పగటిపూట నగరంలో అనుమతి లేదు), ఇతర వాహనాలకు వేగాన్ని బట్టి రూ. 1,000 లేదా ఆపైన చలానా ఉంటుంది.

రహదారి భద్రతలో భాగంగా ట్రాఫిక్‌, ఇతర విభాగాల అధికారులు నెల రోజుల క్రితం పలు రాష్ట్రాలు, వివిధ దేశాల్లో అమలవుతున్న వేగ పరిమితులు, చలానాలపై అధ్యయనం చేశారు. ఆయా విభాగాలు తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి అందజేశాయి. ఆయా రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న విధానాలను క్రోడీకరించి, తాజా సమీక్షలో మార్పులకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరీ వేగంగా వెళ్తే.. బాదుడు తప్పదు

ద్విచక్ర వాహనదారులకు రూ. 300 జరిమానా అంటే ప్రస్తుత చలానాలతో పోలిస్తే.. భారీ ఉపశమనమే. అయితే.. ఇది వేగాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు 50 కిమీ పరిమితి ఉన్న రోడ్డుపై ఒక ద్విచక్రవాహనదారుడు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తే.. జరిమానా పెరుగుతుంది. 100 కిలోమీటర్ల వేగానికి రూ. 700 జరిమానా ఉంటుంది. ఆటోరిక్షాలు, కార్లు, లారీలు(పగటిపూట నగరంలో అనుమతి లేదు), ఇతర వాహనాలకు వేగాన్ని బట్టి రూ. 1,000 లేదా ఆపైన చలానా ఉంటుంది.

రహదారి భద్రతలో భాగంగా ట్రాఫిక్‌, ఇతర విభాగాల అధికారులు నెల రోజుల క్రితం పలు రాష్ట్రాలు, వివిధ దేశాల్లో అమలవుతున్న వేగ పరిమితులు, చలానాలపై అధ్యయనం చేశారు. ఆయా విభాగాలు తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి అందజేశాయి. ఆయా రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న విధానాలను క్రోడీకరించి, తాజా సమీక్షలో మార్పులకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వాహనదారులకు భారీ ఉపశమనం

తాజా సమీక్షలో వాహనదారుల కోణంపై దృష్టిపెట్టాం. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన వేగపరిమితి ఉండడం వం టి ఇబ్బందులను గుర్తించాం. అందుకే.. డివైడర్లు

రోడ్లు, డివైడర్లు లేని రహదారులు, మునిసిపల్‌ రోడ్లలో కేటగిరీల వారీగా ఏకీకృత వేగపరిమితిని అమలు చేయాలని నిర్ణయిం చాం. జరిమానాల విషయంలోనూ వాహనదారులకు భారీగా ఉపశమనం కలగనుంది. అంతేకాదు.. 40కిమీ వేగ పరిమితి ఉన్న చోట్ల ఇప్పటి వరకు ఉన్న చలానా వ్యవస్థలో స్పీడ్‌ లేజర్‌గన్‌లో 40.01, 40.50… ఇలా మార్జినల్‌ వేగం పెరిగినా చలానా జనరేట్‌ అయ్యేది. ఇకపై వేగపరిమితిలో 10ు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. అంటే.. 50కిమీ వేగపరిమితి ఉన్న చోట.. వాహనదారుడు 55 కిమీ వేగంతో వెళ్లినా, చలానా విధించబోము. అదే సమయంలో అతి నిర్లక్ష్యం, అతి వేగానికి జరిమానాల మొత్తం పెరుగుతూ ఉంటుంది.

– ఏవీ రంగనాథ్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page