Home జనరల్ మాదిగ తాజా మాజీ సర్పంచ్ మీద దాడి చేసిన వారి మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి..
జనరల్

మాదిగ తాజా మాజీ సర్పంచ్ మీద దాడి చేసిన వారి మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి..

సుర్బిర్యాల్ దళిత తాజా మాజీ సర్పంచ్ కు అండగా MRPS..

ఈ అంశం మీద జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా సీపీ గారిని కలిసి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తాం..

కుల వివక్షను పాటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక..
కనక ప్రమోద్ మాదిగ
MRPS నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు

ఆర్మూర్, తెలంగాణ వార్త::నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ మండలం, సుర్బిర్యాల్ గ్రామ సర్వసమాజ్ వారి చేత గత 6 నెలలుగా కుల వివక్షకు, కక్ష్య సాందింపుకు గురి అవుతున్న గ్రామ దళిత తాజా మాజీ సర్పంచ్ అయిన సట్ల సవిత గారిని ఆమె భర్త సట్ల గణేష్ గారినీ మరియు గ్రామ మాదిగ కుల సంఘాన్ని పరామర్శించి, వివరాలు తెలుసుకున్న MRPS నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ గారు.
ఈ సందర్భంగా కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ తాజా మాజీ గ్రామ సర్పంచ్ భర్త సాట్ల గణేష్ గారిని గత 6 నెలలుగా గ్రామ సర్వసమాజ్ వారు వేధిస్తూ ఈనెల 23 నాడు వారికి ఇందిరా గాంధీ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ ఇంటి స్థలాలను jcb ద్వారా చదును చేసి, అలాగే వారి పక్కన ఉన్న మిగతా మాదిగ కులం వారి ఇంటి స్థలాలను కూడా కుల వివక్షతో చదును చేసి, ఆ సర్పంచ్ కుటుంబం కట్టుకున్న మడిగేల మీద కూడా అక్రమంగా సర్వసమాజ్ అని పేరు రాయడం జరిగింది. వద్దు అని అడ్డం వెళ్లిన మాదిగ కులస్తులను jcb కింద వేసి తొక్కండి అని మాట్లాడిన వారి పైన పోలీసు యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలి. ఆ దళిత మాదిగ సర్పంచ్ కు మద్దతుగా నిలిచిన మాదిగ కులస్తులను బెదిరించిన సర్వసమాజ్ సభ్యుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు, అలాగే పిడి ఆక్ట్ కూడా పెట్టీ శిక్షించాలి.
గ్రామానికి వచ్చిన అభివృద్ధి నిధులలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ గారు ఎదైనా అవకతవకలకు పాల్పడితే చట్టప్రకారం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలి కానీ చట్టన్ని చేతులోకి తీసుకొని మేము ఎదైనా చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించడం జరిగింది. దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని వివరించడం జరిగింది.
ఇది ముమ్మాటికీ కుల వివక్షనే, కక్ష్య సాధింపు చర్యనే అని దీనికి పరిష్కార మార్గం అధికారులు చూపకపోతే మాదిగలు రోడ్డు మీదికి వచ్చి ఆత్మగౌరవ పోరాటానికి వెనకాడరాని హెచ్చరించడం జరిగింది.

ఈ సమావేశంలో MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్ మాదిగ, MRPS జిల్లా కార్యదర్శి నాగం ప్రదీప్ మాదిగ, MRPS జక్రంపల్లి మండల అధ్యక్షులు వేల్పుల వరుణ్ మాదిగ, MSF జిల్లా నాయకులు కనక శ్రీదీప్ మాదిగ మరియు కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ భీమ్ సింగ్ గుండెపోటుతో మృతి..

తెలంగాణ వార్త:: సీనియర్ కంటి వైద్యుడు డాక్టర్‌ భీంసింగ్‌ మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆయన...

జనరల్

సబ్ రిజిస్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తే క్షమించేది లేదు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి పై దస్తావేజులు, రియల్ ఎస్టేట్...

జనరల్

బాసర డిఎస్పీగా దువ్వాళ రాజేష్ పదవి బాధ్యతలు..

హైదరాబాద్, తెలంగాణ వార్త (మోహన్ సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్)హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ లో బాధ్యతలు...

You cannot copy content of this page