Home హాట్ న్యూస్ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు అధికారులకు కలెక్టర్ హితవు ఖానాపూర్, మల్లారం, కోటగల్లి పాఠశాలల సందర్శన.
హాట్ న్యూస్

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు అధికారులకు కలెక్టర్ హితవు ఖానాపూర్, మల్లారం, కోటగల్లి పాఠశాలల సందర్శన.


తెలంగాణ వార్త :నిజామాబాద్, మార్చి 23 : మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు చేపడుతున్న పనులలో రాజీ ధోరణికి తావు కల్పించకూడదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ చేపడుతున్న ఈ పనులను పక్కా ప్రణాళికతో, నాణ్యతా లోపాలకు ఆస్కారం లేకుండా జరిపించాలని హితవు పలికారు. బుధవారం నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, మల్లారం జిల్లా పరిషత్ హైస్కూల్ తో పాటు నగరంలోని కోటగల్లిలో గల ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సి ఉన్న పనులను పరిశీలించి, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇప్పటికే అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటూ, అవసరమైన పనులను మాత్రమే చేపట్టాలని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పనులు చేపట్టడం ద్వారా మౌలిక వసతులు మెరుగుపడేలా చొరవ చూపాలన్నారు. అలా అని పనుల నాణ్యత విషయంలో రాజీ ధోరణిని అవలంభించకూడదని, ప్రణాళికాబద్ధంగా పనులు జరిపిస్తూ పాఠశాల తరగతి గదులు, ఆవరణతో పాటు పరిసరాలన్నీ ఆకట్టుకునే రీతిలో మార్పు చెందాలని సూచించారు.

ప్రధానంగా తరగతి గదుల్లో వర్షపు నీటి లీకేజీలు ఉండకుండా పైకప్పులకు మరమ్మతులు చేయాలని, చెడిపోయిన, ధ్వంసం అయిన కిటికీలు, తలుపులు, పగుళ్లు ఏర్పడిన గోడలకు కూడా పక్కాగా మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. వర్షపు నీరు, మురుగు జలాలు పాఠశాల ఆవరణలో నిలువ ఉండకుండా డ్రైనేజీల నిర్మాణ పనులు పక్కాగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి పాఠశాలలోనూ విద్యుద్దీకరణ వ్యవస్థ చక్కబడాలని, ఆయా గదులలో స్విచ్ బోర్డులను నెలకొల్పుతూ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాలబాలికలకు వేర్వేరుగా నీటి వసతితో కూడిన టాయిలెట్స్ నిర్మించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వీ.దుర్గాప్రసాద్, సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ దేవిదాస్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రత్నాకర్, భూమాగౌడ్ తదితరులు ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page