తెలంగాణ వార్త:: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్హెచ్ఓ పనిచేస్తున్న సత్యనారాయణ గౌడ్ మట్కా గంజాయి ఇతరత్రా గేములపై ఉక్కు పాదం మోపుతున్నారు. క్షణాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన క్షణాల్లో దాడులు నిర్వహించి మట్కా, గంజాయి, వ్యభిచారం సంఘటనలను తెలుసుకొని దాడులు నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తున్నారు. ఇలాంటి ఎస్ హెచ్ ఓ ఆర్మూర్ పట్టణానికి ఉండడం నేరగాళ్లకు దొంగలకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయంటంలో సందేహం లేదు. ఆయనకు తోడుగా ఏసిపి వెంకటేశ్వరరెడ్డి ఉండడం గమనార్హం.. శుక్రవారం జిరాయత్ నగర్ లో మట్కా ఆడుతున్నారన్న సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జనార్ధన్ సునీత, దాసరి సురేష్, మామిడి గణేష్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ నదీన్, జెట్టి గోపి వద్ద 13 వేల రూపాయలు 6 సెల్ ఫోన్లు పట్టుకొని చట్టరీత్య వారిపై కేసు నమోదుచేసి నట్టు సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Leave a comment