హైదరాబాద్: తెలంగాణ వార్త::
.పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేంధర్ ఖండించారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేంధర్ రెడ్డి జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రలకు చోటు లేదన్న గుత్తా సుఖేంధర్ రెడ్డి,నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని తెలిపారు.
ఈరోజు కూడా ఎమ్మెల్యే గారిని ఉదయం నుండే భారీగా కార్యకర్తలు,నాయకులు,ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామాల VDC సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి మొన్న జరిగిన ఘటన గురించి విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గ మెకానిక్ యూనియన్ సభ్యులు పెద్ద యెత్తున హైదరాబాద్ కి చేరుకొని జీవన్ రెడ్డి గారిని పరామర్శించారు…
ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ఇంటికి చేరుకొని ఘటన సంబంధిత విషయాలు అడిగి తెలుసుకున్నారు…
వారు ఎమ్మెల్యే గారికి దైర్యన్ని కల్పించారు
Leave a comment