Home హాట్ న్యూస్ నిజామాబాద్ జిల్లాలో తలకు తగిలేలా రాళ్లు రువ్వడం లో శిక్షణ..
హాట్ న్యూస్

నిజామాబాద్ జిల్లాలో తలకు తగిలేలా రాళ్లు రువ్వడం లో శిక్షణ..

నిజామాబాద్, తెలంగాణ వార్త: పరారీలో ఉన్న నిందితుడు ఇలియాస్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న హ్యాండ్ బుక్ కీలక సమాచారం లభ్యమైనట్టు పోలీసులు రిమాండ్ డైరీలో నమోదు చేశారు. కార్యకర్తలకు మార్షల్ ఆర్ట్స్ తో పాటు రాళ్లూరువడంలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఇతర మతాల శాంతియుత ర్యాలీల సందర్భంగా విధ్వంసం సృష్టించాలనేదే వీరి కుట్ర. ర్యాలీలో ఉన్న వారి తలకు తగిలేలా రాళ్లను విసరడం ద్వారా ప్రాణా నష్టం ఎక్కువగా ఉండాలి అనేదే పన్నాగం. ఇలాంటి దుశ్చర్యలతో శాంతి భద్రతలకు విగాతం కలిగించాలనేదే కుట్రలో భాగమని విశ్లేషకులు విశ్లేషించారు. .వివరాల్లోకెళ్తే ఓ వర్గానికి చెందిన పేద కుటుంబంలోని చురుకైన యువకుడ్ని ఎంపిక చేసుకోవడం ఇతర వర్గాలపై విద్వేష భావజాలాన్ని నూరి పోయడం, రాళ్లు విసరడంలో సిద్ధస్తుని చేయడం, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చి వారిని మానవ మిస్సైల్లుగా మార్చడం, అవసరమైనప్పుడు సంఘవిద్రోహ చర్య దిశగా వారిని దేశాన్ని అస్తిపరుచాడం, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) ముసుగులో కొందరు ఈ తరహా దుశ్చర్యాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే నిజాంబాద్ వాసులు అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ ఇమ్రాన్, షేక్ షాదుల్లా, మహమ్మద్ అబ్దుల్ ముబీన్ ను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో 24 మంది నిందితులను చేర్చారు. అరెస్ట్ అయిన నిందితులు రిమాండ్ డైరీలో పోలీసులు ఎన్నో విష్మాయాకర అంశాలను పొందుపరిచారు ఆ డైరీలోని వివరాలు మేరకు తొలుత స్వచ్ఛంద ధార్మిక సంస్థల కార్యకలాపాల ముసుగులో విరాళాలు సేకరిస్తూ ఆ సొమ్మును సేవా కార్యక్రమాల ద్వారా పంచి పెడుతూ ఓ వర్గం ప్రజల మన్నలను పొందడం పైనే (పిఎఫ్ఐ) దృష్టి సారించింది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల యువత సులభంగా తమ కాలానికి చిక్కుతారనే భావన ఆ గ్రూపులో ఉంది ఆ గ్రూపు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సమావేశాలు నిర్వహించింది. బైంసా, బోధన్, జగిత్యాల్, హైదరాబాద్, కర్నూల్, నంద్యాల, నెల్లూరులతో పాటు దేశంలో ఇతర ప్రాంతాలను ఈ సమావేశాలు జరిగాయి. వైరి వర్గం ప్రజల్లోకి చేర్చుకొలేందుకు వీలుగా గ్రూపు తరఫున 15 అనుబంధ విభాగాలు కూడా పనిచేస్తున్నాయి అని డైరీ ఆధారంగా పోలీసులు తెలుసుకున్నట్టు సమాచారం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page