Home హాట్ న్యూస్ ఎంపీ అరవింద్ పై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రపదజాలంతో హెచ్చరిక!
హాట్ న్యూస్

ఎంపీ అరవింద్ పై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రపదజాలంతో హెచ్చరిక!

-నువ్వు ఎంపీవి కాదు అష్ట దరిద్రానివి
-కేడీ అరవింద్ ఒళ్ళు దగ్గర పెట్టుకో
-ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నవు
-జిల్లాలో లేని సంస్కృతిని తెచ్చినవు

-వీర శివాజీ విగ్రహం సాక్షిగా దగుల్బాజీ మాటలు
-నీకు చేతనైతే ప్రజా సమస్యలు పరిష్కరించు

-లేకుంటే నిష్క్రమించు

-టీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోము

-నిన్ను వదిలేదే లేదు రాళ్ళతో కొడతం

-నువ్వొక ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, బట్టేబాజ్ ఎంపీ వి

-ఏ గ్రామంలోనూ అడుగుపెట్టలేవు
-నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి
ఆర్మూర్,ఫిబ్రవరి20, (తెలంగాణ వార్త)
“నువ్వు ఎంపీ ధర్మపురి అరవింద్ వి కాదు జిల్లాకు పట్టిన అష్ట దరిద్రానివి. నువ్వు ఏడీవి కాదు నువ్వొక పెద్ద కేడీవి. కేడీ అరవింద్ ఒళ్ళు దగ్గర పెట్టుకో.
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నవు. జిల్లాలో ఏనాడూ లేని విద్వేషాలను రెచ్చగొట్టే విష సంస్కృతిని తెచ్చినవు. సెక్యులరిజానికే తలమానికమైన
వీర శివాజీ విగ్రహం సాక్షిగా దగుల్బాజీ వేషాలు వేసి మత విద్వేషాలు రెచ్చగొట్టినవు. నీకు చేతనైతే ప్రజా సమస్యలు పరిష్కరించు. నీకు దమ్ముంటే నిధులు తెచ్చి జిల్లా అభివృద్ధి లో పాలుపంచుకో. లేకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజాకీయాల నుంచి నిష్క్రమించు.
పిడికెడు మంది లేని బీజేపీ దద్దమ్మలతో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయిస్తావా? నిన్ను వదిలేదే లేదు. నీ అంతు చూస్తాం. మాది 62 లక్షల గులాబీ సైన్యం. ఉఫ్ మని ఊదితే గాలిలో దూది పింజాల్లా లేచి పోతారు. దరిపల్లి, మంచిప్ప గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు జరిపిన దాడుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కొలుకోవాలి. వారికి మన పార్టీతో పాటు జిల్లా అధ్యక్షుడు గా అండగా ఉంటా. మా కార్యకర్తలపై దాడులు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. నువ్వొక ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, బట్టేబాజ్ ఎంపీ వి .పసుపు బోర్డు తేకుండా రైతులను ముంచిన నువ్వు ఏ గ్రామంలోనూ అడుగుపెట్టలేవు. మహిళలు నిన్ను చెప్పులతో కొడతారు జాగ్రత్త అని “పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే,
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా పర్యటించిన జీవన్ రెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో మహిళా భవన్ కు పూజా కార్యక్రమం, జిరాయిత్ నగర్ కాలనీలో అల్హే హైదర్ కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ బేవకూఫ్ ఎంపీ అరవింద్ ది చిల్లర బతుకు, చిల్లర బాష అని ధ్వజమెత్తారు. అరవింద్ జిల్లాకు పట్టిన శని అని,మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, మళ్లీ గెలవనని,ఇక బీజేపీ రాదని, రాజకీయాలలో నూకలు చెల్లినట్టేనని తీవ్ర అసహనానికి లోనవుతున్న అరవింద్ పిచ్చెక్కి సీఎం కేసీఆర్ పై,టీఆర్ఎస్ పై ఆవాకులు చెవాకులు పేలుతున్నాడని ఆయన మండిపడ్డారు. వీర శివాజీ విగ్రహం సాక్షిగా దగుల్బాజీ మాటలు మాట్లాడిన అరవింద్ కులాలు, మతాలను రెచ్చగొట్టాడని ఆరోపించారు. ” అయితే ఖలిస్తాన్ లేకుంటే పాకిస్థాన్. అయితే జమ్మూకాశ్మీర్ లేకుంటే చైనా వాల్. ఎన్నికలొస్తే సర్జికల్ స్ట్రైక్స్ లేకుంటే రోహింగ్యాలు. ఏ రొటి కాడ ఆ పాట పాడటం బిజెపి, ప్రధాన మంత్రి మోడీ అలవాటు. రాష్ట్రానికోక వేషం ప్రాంతానికొక మోసం. మతాన్ని రెచ్చగొడుతున్న అరవింద్ గొప్ప సెక్యులరిస్టు అయిన వీర శివాజీ సైన్యంలో మూడో వంతు ముస్లిం లు, 13మంది ముస్లిం కమాండర్లు ఉన్న సంగతి గుర్తు పెట్టుకో. రైతును ముంచిన వంచకుడివి
ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్,బట్టేబాజ్, బక్వాస్, బడా జూటా అరవింద్ ఇక నువ్వు ఏ గ్రామంలో తిరగలేవు. నీకు దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకురా. చిల్లర రాజకీయాల కోసం ప్రజల మధ్య పంచాయతీ పెట్టకు”అని జీవన్ రెడ్డి అన్నారు.24 గంటల పాటు పోలీసులు నీకు రక్షణ కలిపిస్తున్నారు. గన్ మెన్ లేకుండా అడుగుతీసి అడుగు వేయలేవు. నీ ఆరాచకాలు సాగడం లేదని,పోలీసుల మీద, సీఐ లు,సీపీ, ఎస్ పీ, డీ జీ పీ ల పై తప్పుడు ఆరోపణలు చేస్తుండు.ఇలాంటి నీచుడిపై నాన్ బెయిల్ బుల్ సెక్షన్ల కింద కేసు లు పెట్టాలి. దళితులు, గిరిజనులు, మైనార్టీ లను మోసం చేసిన పార్టీ బీజేపీ. ఈ బీజేపీని ఇంటికి పంపడానికి కేసీఆర్ నడుం బిగించారు. అని ఆయన అన్నారు.ఎంపీ అరవింద్ ఏ గ్రామంలో అడుగుపెట్టినా ప్రజా ప్రతిఘటన తప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page