(తెలంగాణ వార్త) హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సెక్షన్ల వారికి వరాలు ప్రకటించారు. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికీ సీఎం కేసీఆర్ హామీలు, వరాలు ప్రకటించడంతో ముందస్తున్న ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలకు వెళ్లారు. ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటన, విధుల విడుదల, చేసిన అభివృద్ధిని వివరించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న కేసీఆర్.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వారిపై నిఘా పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గమంతా కలియతిరగాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గతంలో జరిగిన అభివృద్ధి, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించే పనిలో నిమగ్నమయ్యారు. కేసీఆర్ అసెంబ్లీలో మెప్మా, సెర్ప్, ఫీల్డు అసిస్టెంట్లతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంపు సైతం తమకు కలిసి వచ్చే అవకాశం అని, వీటిని మరింత ప్రచారం చేసి మరోసారి విజయం సాధించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ముందస్తు రావొచ్చనే అభిప్రాయంతో సన్నద్ధమవుతున్నారు.
Leave a comment