Home హాట్ న్యూస్ నందిపేట్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
హాట్ న్యూస్

నందిపేట్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్ (తెలంగాణ వార్త) నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఎరువుల ధరలను వంద శాతం పెంచి రైతులపై భారం మోపుతూ వేలకోట్ల రూపాయల భారాన్ని రైతుల పైన మోపుతూ రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తుకు కొరివి పెడుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని. నిబంధన తీసుకొచ్చి రైతులను అగమ్యగోచరంకు గురిచేస్తూ వ్యవసాయాన్ని భారం చేసే ప్రయత్నం చేస్తూ ఒకపక్క బాయిల్డ్ రైస్ కొనము అని, పంజాబ్ ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నష్టం చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నా ,కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ నందిపేట్ మండలం పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వైస్ ఎంపిపి ఎంపీటీసీలు ,సొసైటీ చైర్మన్ లు , వార్డ్ మెంబర్లు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు మండల కమిటీ నాయకులు రైతు విభాగం నాయకులు పలు గ్రామాల రైతులు పాల్గొనడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులకు న్యాయం చేస్తూ ఎరువుల ధరలను దించండి అట్లయితే తగ్గినట్లయితే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి పంజాబ్ తరహాలో బిజెపి నాయకులని తెలంగాణలో తిరగకుండా చేస్తామని హెచ్చరించడం జరిగింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page