నిజామాబాద్, తెలంగాణ వార్త:: వుడ్ బ్రెడ్జ్ స్కూల్ బోధన్ రోడ్ ఎన్నారై కాలనీ నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్ లో ఈనెల మూడవ తారీఖున ఫాతిమా అనే విద్యార్థి వుడ్ బ్రెడ్జ్ స్కూల్లో రెండవ తరగతి చదువుతోంది. అదే స్కూల్లో పనిచేస్తున్నా ఒక టీచర్ ఫాతిమా హోంవర్క్ చేయలేదని అనే చిన్న కారణం తోనే ఇష్టరహితంగా పనిష్మెంట్ ఇవ్వడంతోపాటు ఆ యొక్క ఏడు సంవత్సరాల చిన్నారిపై 70 కేజీల బ్యాగుని మెడ పైన మరియు భుజాల పైన పెట్టించి ఒక అర్థగంట గంట గంటసేపు పనిష్మెంటు ఇస్తూ ఒక గట్టి గా ఉన్న చెక్క తోని నెత్తి పైన భుజాలపైన మరియు తొడల పైన ఇష్టారహితంగా కొట్టడంతో ఆ యొక్క బాధను భరించలేక ఫాతిమా ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పడం జరిగింది. తలలో తొడల మధ్య నొప్పి బాగా వస్తుంది నాన్న అని చెప్పడంతో వారు నిజాంబాద్ లో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చెక్ చేసిన తర్వాత ఫాతిమాకు త్వరలో రక్తం గడ్డ కట్టిందని చెప్పడంతో వారి వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాదులో గల ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ నందు తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే విషమించడంతో హాస్పిటల్ తీసుకెళ్లినా కూడా ఆమె బ్రతకపోవడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బ గోని అశోక్ గౌడ్ తెలిపారు.
ఫాతిమా చనిపోవడానికి ముఖ్య కారణం మరియు పూర్తి బాధ్యత వుడ్ బ్రెడ్జ్ స్కూల్ యజమాన్యాని దే నని అందులో పని చేసే టీచర్లని సరైన అవగాహన లేక అంట్రెండ్ టీచర్లచే విద్య బోధన చేయించడం వల్ల ఈ సంఘటన జరిగిందని,టీచర్లు కొంతమంది మరి వారి సైకో ఇజం వల్ల పిల్లల పైన చూపించడం ఇది సరైన పద్ధతి కాదు ఇలా చేయడం వల్ల పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే భయపడుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి .వీరి పైశాచికత్వం ఎట్లా ఉన్నది అంటే వాళ్ళు మొత్తం పూర్తిగా పిల్లల మీదనే ఏదో ఒకటి శాడిజం చేస్తూ వాళ్ళను చిన్న పిల్లలు అని దయ దాక్షిన్యాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టడం, అనేక రకలుగా పిల్లలకు మానసికంగా శారీరకంగా హరాస్మెంట్ చేస్తూ కొంతమంది టీచర్లు వారి యొక్క సైకో నిజాన్ని పిల్లలపైన చూపిస్తున్నారు. స్కూలుకి పిల్లలు పంపిన తర్వాత ఇంటికి వచ్చిన దాకా నమ్మకం లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు అంటే విద్యా బుద్ధులు నేర్పేవాడు. వారి యొక్క అభివృద్ధిని శ్రేయస్సుని ఎదుగుదలను ఎల్లప్పుడూ కోరుకునే వారే ఉపాధ్యాయుడు. ఈ విధంగా చిన్నపిల్లల పైనపైశాచికత్వం చూపించడం అనేది సరైనది కాదని అలాంటి వారిని వెంటనే గుర్తించి తగిన శిక్షపడేలా చూసుకోవాలని తెలియజేశారు . సమాజంలో ఇలాంటి సైకో టీచర్లని గుర్తించి వారి పైన సరైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఇలాంటి టీచర్ల వల్ల మంచి టీచర్లకు కూడా చెడు పేరు వస్తుందని , ఇట్లాంటి వారిని ఏ పాఠశాలలో కూడా చేర్చుకోవద్దని తెలియజేశారు. ఫాతిమా చనిపోవడం కారణం స్కూల్ యజమాన్యానికి కారణమని స్కూలు మూసివేయడమే కాకుండా ఫాతిమా కుటుంబానికి నష్టపరిహారంగా 50 లక్షలు ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ , తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉట్నుర్ సత్యా గౌడ్ ,తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి సంఘాల అధ్యక్షులు బ్రహ్మదండి శ్రీకాంత్ ,తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఆర్మూర్ డివిజన్ విద్యార్థి సంఘం అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Leave a comment